తన కోసం మొక్కుకున్న వృద్ధురాలి కోసం పవన్ ఏం చేశారో తెలుసా?

Publish Date:May 9, 2025

Advertisement

పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత.. సినీ హీరో.. ఆయనది రాజకీయాలలోనైనా, సినిమాలలోనైనా ఒక ప్రత్యేక స్టైల్. సినిమాలలో పవర్ ఫుల్ డైలాగులు చెప్పినా, డ్యాన్సులకు స్టెప్పులేసినా, రాజకీయాలలో ఉన్నదున్నట్లు మాట్లాడినా, ఆ మాటలు కొన్ని సార్లు సొంత పార్టీ, సొంత కూటమి నేతలకే ఇబ్బంది కలిగించినా డోన్ట్ కేర్.. తనకు ఏదనిపిస్తే అది చేస్తారు. ఎ చెప్పాలనుకుంటే అది చెప్పేస్తారు అంతే. ఈ ప్రత్యేకతే ఆయనను రాజకీయాలలోనైనా, సినిమాలలో అయినా మిగిలిన వారి కంటే ఒకింత స్పెషల్ గా నిలుపుతోంది.
తాజాగా ఆయన   పిఠాపురం  నియోజకవర్గానికి చెందిన ఒక వృద్ధు రాలిని మంగళగిరిలోని తన నివాసానికి విందుకు ఆహ్వానించారు.   96 ఏళ్ల ఆ వృద్ధురాలి పేరు  పోతుల పేరంటాలు. ఇంతకూ ఆమెను పవన్ కల్యాణ్ ఎందుకు ఆహ్వానించి అతిథిమర్యాదలతో విందు ఇచ్చారంటే..  

గత ఏడాది జరిగిన ఎన్నికలలో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.  విషయం అది కాదు..పిఠాపురం నుంచి పవన్ గెలవాలని ఈ పోతుల పేరంటాలు మొక్కుకున్నారు. ఈమెది పిఠాపురం నియోజకవర్గం యుకొత్తపల్లి మండలానికి చెందిన ఇసుకపల్లి. ఇంతకీ పోతుల పేరంటాలు మొక్కు ఏమిటంటే.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే.. తన కులదైవం వేగులమ్మకి గరగ చేయిస్తాననీ, పొర్లు దండాలు పెడతానన్నది ఆమె మొక్కు. సరే పవన్ కల్యాణ్ విజయం సాధించారు. అలా ఇలా కాదు.. అద్భుత మెజారిటీతో. దాంతో పేరంటాలు తన మొక్కు తీర్చుకున్నారు. పేదరాలు కావడంతో వేగులమ్మ తల్లికి గరగ చేయించడం ఆమెకు అంత సులువు కాదు. అందు కోసం ఆమె చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. తనకు వచ్చే పెన్షన్ సొమ్ములలో పొదుపు చేసి మొత్తం మీద 27 వేల రూపాయలు కూడగట్టి గరగ చేయించి అమ్మవారికి సమర్పించి, పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకుంది.

ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమెను అభినందించో, ఆర్థిక సహాయం చేసే ఊరుకుంటే సరిపోదని భావించారు. ఆమెను తన నివాసానికి ఆహ్వానించి, పక్కన కూర్చుని కొసరి కొసరిభోజనం వడ్డించారు. ఆమెకు చీర పెట్టి, లక్ష రూపాయలు నగదు ఇచ్చారు. అంతేనా ఆమెకు బయటవరకూ వెళ్లి మరీ వీడ్కోలు పలికారు.   ఇది తెలిసిన వారంతా దటీజ్ పవన్ అంటూ అభినందిస్తున్నారు. పవన్ కల్యాణ్ పేరంటాలుకు స్వయంగా భోజనం వడ్డించి ఆప్యాయంగా అతిథి మర్యాదలు చేస్తున్నఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  

By
en-us Political News

  
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.