పవన్ తొందరపాటు నిర్ణయం.. జనసేనకు తీవ్ర నష్టం!

Publish Date:Dec 4, 2023

Advertisement

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో  తెలిసినోడే గొప్పోడు అంటూ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా అత్తారింటికి దరేది సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అయితే జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ మాత్రం.. ఆ డైలాగ్ సారాన్ని వంటపట్టించుకోలేదని అనిపిస్తుంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేనను పోటీకి దింపి ఆయన తీసుకున్న తొందరపాటు నిర్ణయం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది.  ఒక్కోసారి ఎన్నికల్లో పోటీ కూడా పార్టీకి నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఎప్పుడు బరిలో నిలవాలి? ఎప్పుడు పోటీ నుంచి తప్పుకోవాలి? అనేది రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల అధినేతలకు తెలిసుండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా జనసేన పార్టీకి అలాంటి అనుభవమే ఎదురైంది.

రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకొని మరీ గెలుపోటములను నిర్ణయించేలా ప్రభావం చూపి శభాష్ అనిపించుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసింది. పొత్తులో భాగంగా 119 సీట్లకు గాను ఎనిమిది సీట్లు మాత్రమే కేటాయించింది బీజేపీ. ఆ ఎనిమిదిలో కూడా బీజేపీ నుంచి వచ్చిన వారు, కొత్తగా పార్టీలో చేరినవారు ఉన్నారు.

ఇక ఫలితాలు వచ్చాక తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  పెద్ద తప్పిదం చేశారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 8 స్థానాల్లో ఒక్క కూకట్ పల్లిలో మినహా మిగిలిన ఏడు చోట్లా జనసేన నోటాతో పోటీ పడింది.  డిపాజిట్లు కోల్పోయింది.

అది అక్కడితో ఆగిపోదు.. తెలంగాణ ఫలితాలు ఏపీలో  కూడా జనసేనకి తీవ్ర నష్టం కలిగించే అవకాశముంది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను కేవలం ఒక్క సీటే గెలిచింది జనసేన. తర్వాత ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ గూటికి చేరాడు. దాంతో వైసీపీ నేతలు జనసేనని సింగిల్ సీట్ అని, పవన్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడని పదే పదే ఎద్దేవా చేస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు తెలంగాణ ఫలితాలను పట్టుకొని మరింత హేళన చేస్తారనడంలో సందేహం లేదు. మరోవైపు త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  తెలుగుదేశంతో  కలిసి ఆ ఎన్నికలకు వెళ్తున్న జనసేన.. తెలంగాణ ఫలితం కారణంగా సీట్ల విషయంలో పట్టుబట్టలేదు. టీడీపీ చెప్పిన సంఖ్యకు సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనే పవన్ కళ్యాణ్ నిర్ణయం జనసేనకు నష్టం కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.