పొత్తు పొడుపుపై పవన్ క్లారిటీ.. ఏపీ బీజేపీ తీరుపై అసహనం

Publish Date:May 21, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పొత్తుల ఆవశ్యకతపై జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తి క్లారిటీతో ఉన్నారు. ఈ విషయాన్ని జనసేన వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలన్న సంకేతాలూ పార్టీ అధినేత నంచి వచ్చేశాయని వారు చెబుతున్నారు. అయితే అదే సమయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర నాయకులపై జనసేనాని అసహనంతో ఉన్నరని కూడా వారు చెబుతున్నారు. బీజేపీ ఏపీ నాయకులు జగన్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నారని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అందుకే వారి వ్యాఖ్యలు, ప్రకటనలకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వొదని కూడా పార్టీ కేడర్ కు ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారని చెబుతున్నారు.  బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక వైపు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పిస్తూనే మరో వైపు పొత్తుల విషయంలో అయోమయాన్ని సృష్టిం చే ప్రకటనలు చేయడం ద్వారా జగన్ కు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని  జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తల విషయంపై నిర్ణయం తీసుకోవలసింది బీజేపీ జాతీయ నాయకత్వం కానీ, ఇక్కడి నాయకులు కాదని ఆయన చెబుతున్నారు.

బీజేపీ రాష్ట్ర నేతలు ఒక వైపు పవన్ కల్యాణ్ పార్టీతో బీజేపీకి పొత్తు ఉందని చెబుతూనే.. మరో వైపు తెలుగుదేశం పార్టీతో కలిసే ప్రశక్తే లేదంటూ చేస్తున్న ప్రకటనలు ఓట్ల చీలికకు కారణమయ్యేలా ఉన్నాయని, అందుకే పవన్ కల్యాణ్ ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానంతోనే తేల్చుకోవాల్సిన అవసరం ఉందని జనసేనాని భావిస్తున్నారు.   ఓట్లు చీలనివ్వబోమన్న ప్రకటనతోనే తన ఉద్దేశమేమిటన్నది పవన్ కల్యాణ్ విస్పష్టంగా చెప్పేశారనీ, దానిపై జనసేనలో  ఎలాంటి భిన్నాభిప్రాయం లేకపోవడమే కాకుండా.. తెలుగుదేశంతో పొత్తు అనగానే జనసైనికులలో ఉత్సాహం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అధికారిక ప్రకటన లేకుండానే జనసైనికులు క్షేత్ర స్థాయిలో తెలుగుదేశంతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కనీస ఉనికి లేని బీజేపీ, కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రకటనలతో జగన్ కు మేలు చేసేలా వ్యవహరించడాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ అన్నట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ వల్ల రాష్ట్రంలో జనసేనకు కానీ, తెలుగుదేశంకు కానీ వీసమెత్తు ప్రయోజనం లేదనీ, పైగా ఆ పార్టీని కలుపుకు పోవడం వల్ల మైనారిటీ ఓట్లు దూరం అయ్యే అవకాశం ఉందనీ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.