పొత్తులపై జనసేన నేతల నోటికి పవన్ తాళం

Publish Date:Jul 9, 2023

Advertisement

ఏపీ రాజకీయాలలో అత్యంత హైటెన్షన్ క్రియేట్ చేస్తున్న అంశం రానున్న ఎన్నికల్లో పొత్తులు. ఈ ఎన్నికలలో వైసీపీ ఎలాంటి పొత్తులకు వెళ్లకుండా సింగల్ గానే పోటీ చేస్తుంది. రహస్య పొత్తులు ఏమైనా ఉంటే ఉండే అవకాశం ఉంటుంది కానీ అధికారంగా 175 మంది వైసీపీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే బీజేపీ పయనం ఎటువైపు అన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. కానీ, జనసేన మాత్రం టీడీపీతోనే అని తేల్చి చెప్పేసింది. ఏడాదిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను ఓ మెట్టు దిగేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ మధ్య కాలంలో వారాహీ విజయయాత్రలో పవన్ ప్రసంగాలను బట్టి పొత్తు అంశంపై కొన్ని అపోహలు మొదలవగా.. దీనికి ముగింపు పలికేలా జనసేన నేతలకు  పవన్ స్పష్టత ఇచ్చారు.

పవన్ వారాహీ యాత్రలో తనను సీఎంను చేయాలని కోరడం.. అభిమానులు సీఎం నినాదాలు, మీరు తలచుకుంటే సీఎం అవుతానని, మీరు తనని సీఎం చేయాలని మాట్లాడడం, పలుచోట్ల అభ్యర్థులకు టికెట్ల హామీ ఇవ్వడంతో పవన్ టీడీపీతో పొత్తుకు వెనక్కు తగ్గినట్లుగా ప్రచారం మొదలైంది. దీనికి తోడు కొందరు జనసేన నేతలు పలు టీవీ చానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలలో తమకు పొత్తు అవసరం లేదని.. ఈసారి ఎలాగైనా జనసేన అభ్యర్థులు గెలుస్తారని మాట్లాడంతో పొత్తు అంశం వెనక్కు వెళ్లినట్లుగా ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో కూడా జనసేన ఈ తరహా పోస్టులు పెడుతుండడంతో టీడీపీ సానుభూతిపరులు వాటికి గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ప్రచారం మరింత ముదిరి టీడీపీ-జనసేనల మధ్య దూరం పెరగకముందే పవన్ కళ్యాణ్ జనసేన నేతలు ఒక స్పష్టత ఇచ్చారు.

ఇప్పటికే  పవన్ కళ్యాణ్ తొలిదశ వారాహీ విజయ యాత్ర పూర్తి చేసుకోగా.. ఈ యాత్రకి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మైలేజీ వచ్చింది. జనసేన నేతలు, పవన్ అభిమానులలో ఈ యాత్ర జోష్ పెంచింది. ఈ క్రమంలోనే ఈ వేడిలోనే పవన్ రెండో దశ వారాహి యాత్రకి సిద్ధమవుతున్నారు. దీని కోసమే తాజాగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పొత్తులపై కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. ఇకపై మీడియా ముందు కానీ.. సోషల్ మీడియాలో కానీ జనసేన నేతలు పొత్తుల గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని పవన్ తేల్చి చెప్పారట. పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరూ ప్రస్తావించవద్దని కోరారట. అంతే కాదు,  పార్టీ నేతలు టీవీ చర్చల్లో కానీ, పార్టీ సమావేశాలలో కానీ ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడవద్దని.. ఒకవేళ అలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు కూడా వెనకాడబోమని చెప్పారట.

పార్టీకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, ఎంతో ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే నేను నిర్ణయాలు తీసుకుంటానని, అదే పొత్తుల విషయంలో ఇంకెంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటానో, ఎంత లోతుగా చర్చిస్తానో పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరిన పవన్.. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని.. లోతుగా అధ్యయనం చేశాకనే పొత్తులపై నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకూ సంయమనం పాటించాలని చెప్పారట. అయితే, టీడీపీతో పొత్తు ఖరారు అయిన అంశమే కావడంతో దీనిపై స్పందించి అనవసరపు రాద్ధాంతాలు చేయకుండా పవన్ ఈ హెచ్చరికలు జారీచేసినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. దీనికి తోడు బీజేపీ అంశం తేలే వరకూ టీడీపీ, జనసేన పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఉండదు. ఈ లోగా టీడీపీ-జనసేన మధ్య దూరం పెరిగే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. అందుకోసమే పవన్ పార్టీ నేతల నోళ్ళకి తాళం వేసినట్లు భావించాల్సి వస్తుంది.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.