రేపో మాపో పవన్, చంద్రబాబు భేటీ?

Publish Date:Jul 22, 2023

Advertisement

ఏపీలో ఎన్నికల మూడ్ ఎప్పుడో వచ్చేసింది. దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అధికార వైసీపీ మరోసారి   అధికారం దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తుంటే..   ప్రభుత్వ వైఫల్యాలను  ఎండగడుతూ విపక్షం ప్రజలలోకి వెడుతోంది.  ఇక ఇప్పటికీ జనసేన, తెలుగుదేశంల పొత్తు విషయంలో మాత్రం సస్పెన్స్ వీడలేదు.  ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటున్నా పొత్తుల వ్యవహారం మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. జనసేన-బీజేపీ ఇప్పటికే మిత్రపక్షాలు అయితే  ఈ రెండు పార్టీలు తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్తాయా లేదా అన్నవిషయంలో మాత్రం ఎడతెగని చర్చ అయితే రాష్ట్ర రాజకీయాలలో సాగుతోంది. 

జనసేన తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఇప్పటికే జనసేనాని, ప్రభుత్వ ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అనడం ద్వారా పరోక్షంగానైనా పక్కా క్లారిటీతో చెప్పేశారు.   తెలుగుదేశం, బీజేపీల మధ్య మాత్రం ఆ సంకేతాలు కనిపించడం లేదు. ఆ మధ్య హోంమంత్రి అమిత్ షాతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీ అవ్వడంతో దాదాపుగా పొత్తు ఖరారైనట్లేనని అప్పట్లో ఓ లెవెల్ లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ అది ప్రచారంగా మాత్రమే మిగిలిపోయింది. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే  తెలుగుదేశం,బీజేపీ కలిసే పరిస్థితి  లేదనే  భావనే కలుగుతోంది.   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కాలంలో తన ప్రసంగాలలో ఎక్కడా ఈ పొత్తుల ప్రస్తావన తీసుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశం ఆసక్తికరంగా మారింది.

ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా బీజేపీ మిత్రపక్షాలకు, పాత మిత్రులకూ కూడా  ఆహ్వానాలు అందాయి. అయితే  తెలుగుదేశంకి మాత్రం అందలేదు. అదే సమయంలో ఈ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ పొత్తులపై వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో సహజంగానే మరోసారి ఈ పొత్తుల వ్యవహారంపై ఆసక్తి మొదలైంది.

కాగా, ఢిల్లీ సమావేశానికి హాజరైన పవన్ పొత్తుల అంశంపై ఎక్కడా స్పందించడం లేదు. రాబోయే ఎన్నికలలో జనసేన బీజేపీ కలిసి వెళ్తాయా.. రెండూ కలిసి తెలుగుదేశంతో కలిసి వెళ్తాయా అన్న ఆసక్తి కొనసాగుతుండగానే పవన్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారనే సమాచారం ఒకటి బయటకు వచ్చింది.  రెండు మూడు రోజుల్లోనే మూడు రోజులలోనే ఈ భేటీ ఉండే అవకాశం ఉందని తెలుగుదేశం-జనసేన వర్గాల నుండి అందుతున్న సమాచారం.  దీంతో ఈ సమావేశంలో ఏం చర్చించనున్నారు? అనే విషయం ఇప్పుడు  రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నది.  ఢిల్లీ టూరులో అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన పవన్.. ఆ వివరాలను చంద్రబాబుతో షేర్ చేసుకోవటంతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చలు జరిపేందుకే ఈ భేటీ జరగనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

జనసేన ఎప్పటి నుండో బీజేపీతో కలిసే ఉంది. కానీ  గడచిన నాలుగేళ్ళలో కానీ లేదా రీసెంట్ వారాహి యాత్రలో కానీ పవన్ ఎక్కడా బీజేపీ ప్రస్తావన తెచ్చిన సందర్భం లేదు. ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా జనసేనకు ఓట్లేయండి అని మాత్రమే చెబుతున్నారు.  బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే మరోవైపు చంద్రబాబుతో మూడుసార్లు భేటీ అయ్యారు. కానీ, ఢిల్లీ నుండి తిరిగొచ్చిన తర్వాత మాత్రం పవన్.. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయేని గెలిపించమనే కోరుతున్నారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఎన్డీయే అంటే బీజేపీ-జనసేన మాత్రమే. మరి ఎన్డీయేలో లేని టీడీపీ అధినేతతో పవన్ ఎందుకు కలుస్తున్నారు? ఈ భేటీలో ఏం తేల్చనున్నారు? ఈ భేటీ తర్వాత ఏపీ రాజకీయ సమీకరణాలలో  ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.