కృష్ణాడెల్టాకు జీవనాధారంగా పట్టిసీమ.!

Publish Date:Jul 11, 2026

Advertisement

సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన  తీవ్ర వర్షాభావ పరిస్థితులలో కూడా  కృష్ణా డెల్టా ఆయకట్టును పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరోసారి ఆదుకుంది. కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువ జలాశయాలన్నీ అడుగంటిపోవడంతో కృష్ణా డెల్టా పరిధిలోని వ్యవసాయ భూములు ఎండిపోయే ప్రమాదం నుంచి  గోదావరి వరద జలాలను కృష్ణా నదికి తరలించడం ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు జీవనాధారంగా నిలిచింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమతో పాటు తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను అధికారికంగా పునఃప్రారంభించి, కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదలను పునరుద్ధరించారు.

ప్రస్తుత సీజన్‌లో ఎల్ నినో పంజా విసరడం వల్ల రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎండల తీవ్రతకు జలాశయాల్లోని నీరు ఆవిరైపోయే పరిస్థితులు తలెత్తాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులు ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం,  నాగార్జున సాగర్ వైపు నుంచి ఎగువ ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో సముద్రంలో వృథాగా కలిసిపోయే గోదావరి   నీటిని కృష్ణా డెల్టా వైపు మళ్లించేందుకు  తెలుగుదేశం  నిర్మించిన పట్టిసీమ పథకం దోహదపడింది.  

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.   సీఎం నారా చంద్రబాబు నాయుడు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చాలా సమయం పడుతుంది కనుక, తక్షణ ఉపశమనంగా  1,300 కోట్ల రూపాయల వ్యయంతో రికార్డు కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. అయితే..  ఆ సమయంలో ఈ ప్రాజెక్టు తీవ్ర రాజకీయ వివాదాలకు, విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. అప్పటి ప్రతిపక్ష నేత   జగన్  ఒట్టిసీమగా అని అభివర్ణించారు.  అయితే ఆ పట్టిసీమే కృష్ణా డెల్టాను ఆదుకుని అప్పడే గట్టి సీమ అని నిరూపించుకుంది.  ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ పట్టిసీమను పూర్తిగా విస్మరించారు. 

ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లోనూ రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వరప్రదాయినిగా ఆదుకుంటోంది. ప్రాజెక్టు పునఃప్రారంభం సందర్భంగా గోదావరి జలాలకు మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా  జలహారతి  ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి..  మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యంగా పట్టిసీమను అభివర్ణించారు.  పట్టిసీమ ప్రాజెక్టు  రాష్ట్ర వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. ఇప్పటివరకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రికార్డు స్థాయిలో 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు విజయవంతంగా మళ్లించగలిగామన్న రామానాయుడు..  ఈ నీటి సరఫరా కారణంగా కృష్ణా డెల్టా పరిధిలో పంటలు సమృద్ధిగా పండటమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా సంపద,  ఆదాయం చేకూరిందని  గణాంకాలతో వివరించారు.

 ఐదేళ్ల  జగన్ పాలన కేవలం రాజకీయ వైషమ్యాలు, అవగాహనా రాహిత్యం కారణంగానే గత ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్వహణను పూర్తిగా గాలి కొదిలేసిందని విమర్శించారు. ఒకప్పుడు ఈ ప్రాజెక్టును అవహేళన చేసిన వారే..  కృష్ణా డెల్టా కరవు కోరల్లో చిక్కుకున్న వేళ ఈ నీటిపైనే ఆధారపడాల్సి వచ్చిందన్నారు. పట్టిసీమపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కృష్ణా డెల్టా రైతులకు సమాధానం చెబుతారని మంత్రి నిలదీశారు. 

Pattiseema Lift Irrigation, Krishna Delta, Nimmala Ramanaidu, El Nino AP Drought, Chandrababu Naidu Water Management

By
en-us Political News

  
జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకోవడానికి, ప్రకృతి ఒడిలో కాస్త ప్రశాంతతను వెతుక్కోవడానికి ప్లాన్ చేసిన ఆ ట్రిప్.. చివరకు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.
 మహిళకు ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన..
ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అనుకరిస్తూ వీడియోలు చేసి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ సునీల్ తాజాగా క్షమాపణలు చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఘోరమైన, కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ దాహం వేసి నీళ్ల బాటిల్ అనుకుని యాసిడ్ తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల ఎస్. జానకి
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో గానకోకిలగా, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్. జానకి. ఆమె తన మధురమైన గానంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆదివారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమిళ సినీ నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.