రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. కేసీఆర్ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ

Publish Date:Aug 23, 2023

Advertisement

కేబినెట్ విస్తరణ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రిదే. తేన కేబినెట్ లో ఎవరు ఉండాలి, ఎవరిని తొలగించాలన్న నిర్ణయాధికారంలో మరొకరి జోక్యానికి తావేలేదు. రాజ్యాంగ బద్ధంగా అది ముఖ్యమంత్రికి సంక్రమించిన అధికారం. సీఎం ప్రతిపాదించి పంపిన వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం మాత్రమే గవర్నర్ చేయాల్సింది. చేయగలిగింది. ఈ వ్యవహారంలో కానీ విషయంలో కానీ ఎవరికీ ఎటువంటి అనుమానాలూ, సందేహాలూ లేవు. కానీ తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేసీఆర్ తలపెట్టిన మంత్రివర్గ విస్తరణ రాజకీయవర్గాలలోనే కాదు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ రేపుతోంది. ఏం జురుగుతుంది? ఏం జరగబోతోంది? అన్న సస్పెన్స్ రేపుతోంది.

ఇంతకీ విషయమేమిటంటే.. రానున్న అసెబ్లీ ఎన్నికలలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను 105 పేర్లతో కేసీఆర్ ప్రకటించారు. అలా ప్రకటించిన  వెంటనే ఇలా మంత్రివర్గ విస్తరణకు రెడీ అయ్యారు. మంత్రివర్గంలోకి   పట్నం మహేందర్‌రెడ్డిని  తీసుకోవాలని ప్రభుత్వం భావించారు. ప్రమాణ స్వీకారం కోసం సమయం కేటాయించాలంటూ  రాజ్‌భవన్‌కు సోమవారమే ప్రభుత్వం వర్తమానం పంపింది. సప్తమి రోజున మంచి ముహూర్తం కనుక ఆ రోజు అంటే బుధవారం(ఆగస్టు 23)న ఆ కార్యక్రమం  ఖరారు చేయాలని విజ్ణప్తి కూడా చేసింది.  ఉదయం 11.30 గంటలకు మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు  ప్రభుత్వం నుంచి లీకులు కూడా వచ్చాయి.

స్వయంగా  పట్నం  మహేందర్ రెడ్డే మీడియాతో చిట్ చాట్ చేస్తూ తన ప్రమాణ స్వీకారం బుధవారం (ఆగస్టు 23) ఉదయం పదకొండున్నరకు ఉంటుందని కూడా చెప్పారు.  అయితే రాజ్ భవన్ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. అప్పాయింట్ మెంట్ కూడా ఫిక్స్ కలేదు.   ఆమె డెంటల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనీ,  అందుకే అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదనీ రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.  

గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్  సోమవారం (ఆగస్టు 21 వరకూ  పుదుచ్చేరిలో ఉన్నారు. మంగళవారం అంతా ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం తమ వినతి మేరకు  బుధవారం (ఆగస్టు 23) ప్రమాణ స్వీకార  కార్యక్రమం బుధవారం జరిపించేందుకు ఎటువంటి అవాంతరం ఉండదని భావించినప్పటికీ రాజ్‌భవన్ నుంచి  సమాచారం లేకపోవడంతో ఉత్కంఠ మొదలైంది. ఆమె నుంచి ఎప్పుడు సమాచారం వస్తుందా అని టెన్షన్ పడుతోంది. రాజ్ భవన్, ప్రగతి భవన్ విభేదాలే ఈ జాప్యానికి కారణమా అన్న అనుమానాలూ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.