భారతీయుల ఆరోగ్య యోగానికి ఆది గురువు.. పతంజలి మహర్షి!
Publish Date:Jun 21, 2025
Advertisement
ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈసారి యోగా డే దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అందులోనూ అన్ని రాష్ట్రాల చూపులు విశాఖపట్నం ఆర్.కె బీచ్ వైపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజు యోగా అనేది విదేశీయులను కూడా ఆకర్షించే అంశం అయిపోయింది. ఇది మనిషి ఆరోగ్యానికి జీవనాడి అయ్యింది. అయితే ఈ యోగాను భారతీయులకు అందించినది పతంజలి మహర్షి. అందుకే యోగా డే సందర్బంగా ఆ మహనీయుడిని గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యం. అలాగే.. యోగా కోసం పతంజలి మహర్షి చేసిన కృషి, ఆయన చరిత్ర తెలుసుకుంటే.. పతంజలి మహర్షి చరిత్ర వృత్తాంతం భారత సంస్కృతిలో ఒక గంభీరమైన, ఆధ్యాత్మికంగా ప్రేరణాత్మకమైన గాథ. ఇది పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ఒక భగవద్భక్తుడు, తత్త్వవేత్త, గొప్ప పండితుడు. ఆయన్ను మూడు ముఖ్యశాస్త్రాలలో విపులమైన కృషి చేసినవాడిగా గుర్తిస్తారు . ఆ మూడు ఏమిటంటే.. యోగశాస్త్రం, వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం), ఆయుర్వేదం. ఆయన చరిత్ర వృత్తాంతం.. ఆదిశేషునిగా అవతారం.. పతంజలి మహర్షి, విష్ణుమూర్తికి సేవ చేసే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడతారు. ఒక సందర్భంలో, విష్ణుడు తన హృదయంలో శివుని ఆనందతాండవాన్ని దర్శించుకుంటుండగా, ఆదిశేషునికీ ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలిగిందట. అందుకు అనుగుణంగా విష్ణుమూర్తి ఆదిశేషునికి భూలోకంలో అవతరించాల్సిందిగా సూచించాడు. గోనికా తపస్సు & పతంజలి అవతారం.. విష్ణుమూర్తి ఆదిశేవును భూలోకంలో అవతరించమని ఆదేశించి సమయంలో గోనికా అనే పతివ్రత స్త్రీ, సూర్య భగవానుని ప్రార్థిస్తూ లోకానికి ఉపయోగపడే బిడ్డ కావాలని తపస్సు చేస్తూ, చేతులలో నిండుగా నీటిని తీసుకుని అంజలి ఘటిస్తూ అంటే నమస్కారం చేస్తూ అర్చించుకుంటున్న సమయంలో పాము రూపంలో ఆదిశేషుడు ఆమె చేతుల్లోకి పడిపోయాడట. అందువల్ల ఆ బాలుని పేరు పతంజలి (పతనము + అంజలి) అని ఉద్భవించింది. నటరాజుని తాండవ దర్శనం.. పతంజలి మహర్షి తన తల్లిదండ్రుల వద్ద పెరిగి, తర్వాత చిదంబరం వచ్చినాడు. అక్కడ శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్నాడని తెలిసి. అతనికి శివుని తాండవాన్ని చూసే అవకాశం లభించింది. నంది, భృంగిలు అతని శరీరాకృతిపై హేళన చేసినా, అతను నోరుతో “నటరాజ నవకం” అనే స్తోత్రాన్ని గానం చేసి శివుని ఆనందింపజేశాడు. ఈ నటరాజ నవకం అనేది పూర్తీగా డమరుక శబ్దంతో ఉంటుంది. నటరాజ నవకం విని సంతోషించిన శివుడు నిన్నునాట్యంలో భాగం చేస్తాను బాధపడకు అని చెప్పి శివుడు అతనిని తన పాదాల చుట్టూ చుట్టి తాండవంలో భాగస్వామిని చేశాడు. ఇది పతంజలి మహర్షి భగవత్ ప్రేమకు సంకేతం. త్రికరణ శుద్ధి లక్ష్యంగా విద్యాబోధన.. శివుని ఆశీర్వాదంతో పతంజలి, భూలోకానికి త్రికరణ శుద్ధి అంటే మనస్సు, వాక్కు, కర్మ అనేవి సాధించేందుకు మూడు శాస్త్రాలను అందించాడు. యోగశాస్త్రం – మనస్సు శుద్ధి కోసం వ్యాకరణం – వాక్కు శుద్ధి కోసం ఆయుర్వేదం – శరీర శుద్ధి కోసం శిష్యులకు బోధన.. పతంజలి 1000 మందికి బోధన ఇవ్వాలనుకున్నాడు. అందరి అర్హతలు భిన్నంగా ఉండటంతో, ఓ తెర వెనుక ఆదిశేషురూపంలో బోధించాడు. తెర ఎత్తవద్దని చెప్పినా ఒక శిష్యుడు అతని నియమాన్ని ఉల్లంఘించి తెర తీసేశాడు. దీంతో 999 మంది విద్యార్థులు కాలిపోయారు. మిగిలిన శిష్యుడికి పతంజలి మొత్తం విద్యను బోధించాడు, కాని అతను శాపగ్రస్తుడై బ్రహ్మ రాక్షసుడయ్యాడు. శిష్యుడిని శాప విముక్తుడిని చేసిన ఘట్టం.. ఆ బ్రహ్మ రాక్షసుడు జ్ఞానాన్ని బోధించగల అర్హుడిని వెతుకుతూ, సరైన జవాబు చెప్పని వారిని మింగేవాడు. చివరికి పతంజలి మహర్షి స్వయంగా శిష్యుడి రూపంలో (చంద్రశర్మగా) వచ్చి, సరైన సమాధానం ఇచ్చి, జ్ఞానం తీసుకొని శిష్యుడిని శాపం నుండి విముక్తుణ్ని చేశాడు. ఆ రాక్షసుడు తరువాత గౌడపాదాచార్యుడుగా అవతరించాడు. ఆయన రచనలు.. యోగ సూత్రాలు (196 సూత్రాలు) – యోగ దార్శనికశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం. మహాభాష్యం – పాణినీ వ్యాకరణంపై వ్యాఖ్యాన గ్రంథం. ఆయుర్వేదానికి సంబంధించిన రచనలకూ ఆయనకు ఆపాదించబడింది, కానీ ఆధారాల పరంగా స్పష్టత లేదు. జీవసమాధి స్థలం.. పతంజలి మహర్షి జీవసమాధి స్థలం తమిళనాడు, తిరుపత్తూరు (త్రిచీ దగ్గర)లోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉంది. ప్రార్థన శ్లోకం.. యోగేన చిత్తస్య పదేన వాచాం మనస్సు, వాక్కు, శరీరం శుద్ధి కోసం పతంజలిని ప్రణమిస్తాను అని ఈ ప్రార్థన అర్థం.
మలం శరీరస్య చ వైద్యకేన।
యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం
పతంజలిం ప్రాంజలిరానతోఽస్మి॥
*రూపశ్రీ
http://www.teluguone.com/news/content/patanjali-yog-sutra-35-200381.html





