హత్య కాదు.. రోడ్డు ప్రమాదమే.. పాస్టర్ ప్రవీణ్ మరణంపై పోలీసులు

Publish Date:Apr 12, 2025

Advertisement

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై వివాదానికి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలోనే మరణించారని తేల్చేశారు. ఈ మేరకు ఏలూరు రేంజి ఐజీ శనివారం ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన  పాస్టర్  ప్రవీణ్ పగడాలది ఎంత మాత్రం హత్య కాదనీ, ఆయన రోడ్డు ప్రమాదంలోనే మరణించారనీ, సీసీ ఫుటేజీల ఆధారాలతో సహా తెలిపారు. అతిగా మద్యం సేవించి… ఆ మత్తులోనే వేగంగా వాహనాన్ని నడుపుతున్న క్రమంలో ప్రవీణ్ మూడు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, చివరిగా నాలుగో సారి కంకరరోడ్డుపై బైక్ స్కిడ్ అయి పడి మరణించారని చెప్పారు.  

ఈ విషయంలో ఇప్పటిదాకా   ప్రవీణ్ మరణాన్ని వివాదాస్పదం చేసేలా ప్రకటనలు చేసిన వారితో పాటుగా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిపారు పాస్టర్ ప్రవీణ్ పగడాలని హీత్య అన్న వార్తల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  హత్య చేశారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

అంతే కాకుండా ప్రవీణ్ పగడాల మృతికి దారి తీసిన అన్ని పరిస్థితులను సాక్ష్యాలతో సహా వివరించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి బైక్ పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల తన ప్రయాణ విషయాన్ని కుటుంబానికి తప్ప మరెవరికీ చెప్పాలేదన్నారు.  హైదరాబాద్, రాజమహేంద్రవరం మార్గమధ్యంలో రెండు చోట్ల ఆగిన ప్రవీణ్… ఆ రెండు ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో డిజిటల్ పే మెంట్లు చేశారని అందుకు సంబంధించిన రుజువులు చూపారు. అలాగే మార్గ మధ్యంలో ఆయన ఆరుగురితో మాట్లాడారనీ, ఆ విషయాన్ని కూడా తాము  ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ద్వారా ధృవీకరించు కున్నామన్నారు.  

 ప్రవీణ్ పగడాల  పోస్టుమార్టం నివేదిక కూడా  ఆయన రోడ్డు ప్రమాదం కారణంగానే ప్రవీణ్ చనిపోయినట్లుతేల్చిందని చెప్పారు.  విచారణలో భాగంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపుగా 113 మందిని విచారించామని తెలిపారు. ప్రవీణ్ ప్రయాణించిన దూరంలో ఉన్న దాదాపుగా అన్ని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విచారణ సాగించామని తెలిపారు.  ఈ మొత్తం విచారణలో పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే  చనిపోయారని తేలిందని ఐజీ చెప్పారు.

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.