విమానాలు ఒకే..బట్ రైల్వే అంటే మోజు..!

Publish Date:Jun 2, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల, 12 ఏళ్ల సుదీర్ఘ నిర్విరామ  పోరాటం  ఫలించింది. దేశంలో  18వ రైల్వే జోన్‌గా అవతరించిన  సౌత్ కోస్ట్ రైల్వే జోన్  ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటు యావత్ ఆంధ్రుల  ఆత్మగౌరవం నిలబడింది. గతంలో ఒక చిన్న రైల్వే సమస్య వస్తే ఒడిశాలోని భువనేశ్వర్ చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండేది.  ఇప్పుడు విశాఖపట్నం వేదికగా ఈ నూతన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం, జనరల్ మేనేజర్ , డివిజనల్ రైల్వే మేనేజర్  వంటి కీలక అధికారులు మనకు ఇక్కడే అందుబాటులోకి రావడం ఒక చారిత్రాత్మక మార్పు. స్థానిక ప్రజలకు రైల్వేలపై నమ్మకాన్ని, సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకునే సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ఈ నిర్ణయం అందిస్తోంది.

ఈ అద్భుత విజయానికి సారథిగా నిలిచిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన అనుభవాలను తెలుగువన్ న్యూస్ తో  ప్రత్యేకంగా పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు పౌర విమానయాన శాఖ   బాధ్యతలు అప్పగించి ప్రపంచంలోనే టాప్ 3 స్థానంలో నిలబెట్టేలా ప్రోత్సహించినప్పటికీ, తనకు రైల్వే శాఖపై ఉన్న మక్కువ విడదీయరానిదని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇది కేవలం ఒక శాఖపై ఉన్న ఆసక్తి మాత్రమే కాదు..  తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు గారి అద్భుత వారసత్వం. నౌపాడ - గుణుపూర్ నారోగేజ్ లైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చడం, విశాఖపట్నం నుంచి పలాస, భువనేశ్వర్ వరకు కొత్త మెమో   రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణికులకు అనుసంధానతను పెంచడంలో ఎర్రన్నాయుడు గారు చేసిన కృషిని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ స్పూర్తితోనే తాను ఎంపీ అయినప్పటి నుంచి ఒక్క డిఆర్ఎం,  జిఎమ్  సమావేశాన్ని కూడా వదలకుండా ఢిల్లీ, భువనేశ్వర్ వేదికలపై మన సమస్యలను బలంగా వినిపించానని చెప్పారు.

ఈ రైల్వే జోన్ సాధన అంత సులువుగా సాగలేదు. 2014 నుంచే పట్టు వదలకుండా పోరాటం చేస్తూ, రైల్వే సమస్య తీవ్రతను కేంద్రానికి తెలియజేయడానికి ఇచ్చాపురం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో రాత్రిపూట పడుకుని దీక్షలు చేసిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. ఫలితంగా 2018 లోనే కేంద్ర ప్రభుత్వం ఈ జోన్‌ను ప్రకటించింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన  50 ఎకరాల భూమిని కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రాజెక్ట్ తీవ్రంగా ఆలస్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా  తీసుకుని, కేవలం 100 రోజుల్లోనే ల్యాండ్ క్లియరెన్స్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ఫాస్ట్ ట్రాక్‌పైకి తీసుకు వచ్చింది. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కనెక్టివిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించిన శ్రీకాకుళం - తిరుపతి రైలు ఏకంగా 70 శాతం ఆక్యుపెన్సీతో   నడుస్తూ రికార్డు సక్సెస్ సాధించింది. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం కేంద్రాలుగా హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ, గుజరాత్ వంటి ప్రధాన నగరాలకు నేరుగా  రైళ్లను నడపడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పండుగలు, సెలవులకు సొంత ఊళ్లకు వచ్చే ప్రయాణికులు ఇకపై రెండు, మూడు రైళ్లు మారే అవస్థలు తప్పుతాయి. ఏపీలో జాయిన్ అయి దేశంలో ఎక్కడెక్కడో సేవలు అందిస్తున్న తెలుగు రైల్వే ఉద్యోగులు, అధికారులు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే పనిచేసుకునే సువర్ణావకాశం లభించింది. ఈ చారిత్రక ఘట్టాన్ని సాకారం చేసిన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ఉత్తరాంధ్ర ప్రజల తరపున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

By
en-us Political News

  
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.