తెలంగాణలో త్రిముఖ పోరు అనివార్యం.. తెలుగుదేశం ఓటు బ్యాంకుపైనే పార్టీల ఆరాటం

Publish Date:May 30, 2022

Advertisement

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో త్రిముఖ పోరు అనివార్యం అని అంతా భావిస్తున్న నేపథ్యంలో  ఈ ఎన్నికలలో  విజయం కోసం ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుపైనే దృష్టి పెట్టాయి. రాష్ట్ర అసెంబ్లీలో కనీస ప్రాతినిథ్యం కూడా లేని తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణ సెంటిమెంటుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటు బ్యాంకు గత రెండు ఎన్నికలలో దాదాపు తటస్థంగా ఉండిపోయిందన్నది పరిశీలకుల అంచనా.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వేరే వేరే పార్టీలలో చేరిపోయారు. తెలుగుదేశం నేతలను భారీగా చేర్చుకున్న పార్టీ మాత్రం టీఆర్ఎస్సే. రేవంత్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ గూటికి చేరారు. మరి కొందరు కమలం కండువా కప్పుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా తెలంగాణ ఆవిర్భావం తరువాత ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరలేదని పరిశీలకులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో, స్థానిక సమరంలో తెలంగాణలో తెలుగుదేశం అభ్యర్థులు పోటీలో ఉండటమే అందుకు తార్కాణంగా చెబుతున్నారు.

తెలంగాణలో రంగంలో ఉన్న అభ్యర్థులకు పార్టీ నుంచి మద్దతు ఉన్నా లేకున్నా.. తమ సొంత ఖర్చులతో పార్టీపై అభిమానంతో వారు రంగంలోకి దిగుతున్నారు. పార్టీ జెండా భుజాన వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. వీరే కాకుండా.. హైదరాబాద్ ప్రగతి వెనుక తెలుగుదేశం కృష్టి, చంద్రబాబు హయాంలో అనుసరించిన విధానాలు ఉన్నాయని నమ్మే వర్గం ఒకటి ఉంది. హైదరాబాద్ ఐటీ హబ్ గా రూపుదిద్దుకోవడం వెనుక చంద్రబాబు కృషి ఉందని స్వయంగా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే పలు మార్లు ప్రస్తావించారు. చంద్రబాబు వేసిన పునాదులపైనే తాను ముందుకు సాగానని చెప్పిన సంగతి కూడా తెలిసిందే. అదే భావన హైదరాబాద్ లో స్థిరపడిన పలువురిలో బలంగా ఉంది. అందుకే హైదరాబద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలోనూ, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనూ గత రెండు ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడ్డాయి.  ఆ ఓటుపైనే పార్టీలు ఇప్పుడు దృష్టి పెట్టాయి.   వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో త్రిముఖ పోరు అనివార్యం అని భావిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఓటుపై దృష్టి సారించాయి.

త్రిముఖ పోరు నేపథ్యంలో  ప్రతి ఓటూ కీలకమేని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో తెలుగుదేశానికి ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకుని లబ్ధి పొందాలని భావిస్తున్నాయి. అందుకు అంది వచ్చిన అవకాశంగా ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు భావించాయి. ఈ విషయంలో మిగిలిన రెండు పార్టీల కంటే టీఆర్ఎస్ ముందుంది. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ జయంతి, వర్థంతిలను పట్టించుకోని టీఆర్ఎస్.. ఈ ఏడాది మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరీ కార్యక్రమాలు నిర్వహించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా  ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులర్పించడం, రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం ఇందులో భాగంగానే చూడాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధిని ప్రత్యేక  ప్రస్తావించడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడూ టీఆర్ఎస్ ఎన్టీఆర్ ను స్మరించుకున్న దాఖలాలు లేవని వారు చెబుతున్నారు. త్రిముఖ పోటీ అనివార్యమన్న నేపథ్యంలోనే టీఆర్ఎస్ కు ఇప్పుడు ఎన్టీఆర్, ఆయన సేవలు గుర్తుకొచ్చాయని వారు విశ్లేషిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ గూటికి వచ్చిన వ్యక్తి ఆయన ఎన్టీఆర్ పట్ల ప్రత్యేక గౌరవం, అభిమానం ఉన్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ వీడిన తరువాత ఇప్పటి వరకూ ఆ పార్టీపై కానీ, ఆ పార్టీ అధినేతపై కూడా చిన్న పాటి విమర్శ చేసిన దాఖలాలు కూడా లేవు. తెలంగాణ రాష్ట్రంలో కనీసంలో కనీసం 35 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉందన్నది పార్టీల అంచనా, ఉమ్మడి ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాలలో నేటికీ తెలుగుదేశం క్యాడన్ చెక్కు చెదరకుండా ఉందన్నది పార్టీల అంచనా. ఆ కారణంగానే ఆ ఓటు బ్యాంకుపై గురి పెట్టేందుకు ఎన్టీఆర్ శత జయంతిని ఒక అవకాశంగా తీసుకుని కార్యక్రమాలను రూపొందించుకునే పనిలో పార్టీలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.