రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
Publish Date:Jul 20, 2025
Advertisement
రేపటి (జులై 21)నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు 21 రోజుల పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు 12నుంచి 18 వరకు పార్లమెంట్ సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లుల తో పాటు, కొత్తగా మరో 8 కొత్త బిల్లులను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంటు భవన సముదాయంలోని ప్రధాన హాల్‌లో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఉభయసభలు సజావుగా కొనసాగేందుకు సూచనలు తీసుకోవడం, ఉభయసభలలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్. ఎన్సీపీ నుంచి సుప్రియాసూలే, తెలుగుదేశం పార్టీ నుంచి లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్,గురుమూర్తి, బీఆర్‌ఎస్‌నుంచి సురేష్‌రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు.. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి.
http://www.teluguone.com/news/content/parliament-meetings-25-202330.html





