పార్లమెంట్ పరీక్ష ఎవరికి?

Publish Date:Jul 18, 2022

Advertisement

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ( సోమవారం) నుంచి మొదలవుతున్నాయి. వచ్చేనెల (ఆగష్టు) 12వ తేదీ వరకూ మొత్తం 14 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు జరుగ నున్నాయి. ఈ సమావేశాల్లో  మొత్తం 32 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అందులో 14 బిల్లులు సిద్డమయ్యాయి. మరో వంక ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి.  త్రివిధ దళాల్లో తాత్కాలిక నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకం, ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తాలని విపక్షాలు భావిస్తున్నాయి.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు తమ అజెండాను ప్రభుత్వం ముందుంచాయి. అదే సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రతిపక్షాలను కోరారు. అలాగే నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అగ్నిపథ్, ఆర్ధిక పరిస్థితి, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల. ద్రవ్యల్బణం ఏదంటే అది చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అయితే, అందుకు ప్రతిపక్షాలు నిబంధనలు పాటించాలని షరతు విధించారు. అయితే  ఇదంతా రొటీన్ గా జరిగే వ్యవహారమే. ఇందులో కొత్తదనం లేదు. చివరకు సభలో ఏమి జరుగుతుందో, అదే నిజం.

అదే కీలకం. గత అనుభవాలను గుర్తు చేసుకుంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేది అందరికీ తెలిసిన విషయమే. లోతుల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు.  అయితే ఏది ఏమైనా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీ వేడీగా సాగే సూచనలు అయితే  స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వరస ఎన్నికల విజయాలతో మాంచి జోష్ మీదున్న అధికార బీజేపీ / ఎన్డీఎ కూటమి కంటే, వరస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ సారథ్య విపక్షానికే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పరీక్ష కాబోతున్నాయని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే రాష్ట్రపతి ఎన్నిక రూపంలో విపక్షాలకు తొలి పరీక్ష ఎదురవుతోంది. ప్రతిపక్షాల ఉమ్మడి  అభ్యర్ధి యశ్వంత్ సిన్హా చివరి యత్నంగా ఆత్మ ప్రబోధం అపీల్ చేశారు. కానీ, అది పనిచేసే వాతావరణం   కనిపించడం లేదని ప్రతిపక్షాలే పెదవి విరుస్తున్నాయి. ప్రతిపక్ష అభ్యర్ధి గెలిచే అవకాశాలు లేవు. అది అందరికీ తెలుసు.  

అయితే ఆశించిన మేరకు అయినా యశ్వంత్ సిన్హాకు మద్దతు లభించే అవకాశం ఉందా అంటే అదీ లేదని తేలిపోయింది. ఎందుకంటే ప్రతిపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలే ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. చివరికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి క్రాస్ వోటింగ్ ఉంటుంది అని అంటున్నారు.  అధికార ఎన్డీఎ కూటమి గిరిజన మహిళా ద్రౌపతి ముర్మును అధికార కూటమి అభ్యర్ధిగా ప్రకటించడంతోనే  సీన్ మారిపోయిందని మమతా బెనర్జీనే బహిరంగంగా అంగీకరించారు.  ఈ నేపధ్యంలో యశ్వంత్ సిన్హాకు, ఆశించిన శాతం ఓట్లు రాకపోతే,  ప్రతిపక్షాల  ఐక్యత మరోమారు నవ్వుల పాలవుతుంది. ఎండమావిగా తెలిపోతుందని అంటున్నారు. ఒక విధంగా రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్ష పార్టీల   ఉమ్మడి  ఓటమికి మరో నిదర్శనంగా నిలుస్తుందని, ఆ ప్రభావం రానున్న రోజుల్లో దేశ రాజకీయాలపై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

ఇక ఉప రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి మార్గరెట్ ఆల్వా విషయంలోనూ ప్రతిపక్షాలలో అప్పుడే  లుకలుకలు మొదలయ్యాయి. మార్గరెట్ ఆల్వా తన జీవిత చరిత్రలో, కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీకి వెస్ట్ ల్యాండ్ కుంభకోణంతో సంబంధమున్న  విషయాన్ని ప్రస్తావించిచారని బీజేపీ బయట పెట్టింది. ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు గాంధీ కుటుంబంపై అంత తీవ్ర ఆరోపణలు చేసిన మార్గరెట్ అల్వాకు కాంగ్రెస్ పార్టీ ఎలా మద్దతు ఇస్తుందని కొందరు  కాంగ్రెస్ నాయకులే ప్రశ్నిస్తున్నారు. మరో వంక, తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ, తెరాసకు కూడా కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇచ్చే విషయంలో అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది.  ఇతర పార్టీల విషయం ఎలా ఉన్నా, రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా తెరాస మద్దతు ఇచ్చే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా, కాంగ్రెస్, తెరాసల మధ్య పెద్ద రచ్చే జరిగింది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన యశ్వంత్ సిన్హాను, కాంగ్రెస్ నాయకులు ఎవరూ కలవడానికి వీలు లేదని, హుకుం జారీ చేశారు. కాదని కలిస్తే గోడకేసి కొడతానని హెచ్చరించారు. అంతే కాదు, ఆ ఇంటి (ప్రగతి భవన్) మీద వాలిన కాకి ఈ ఇంటి ( గాంధీ భవన్) మీద వాలేందుకు వీలు లేదని పేర్కొన్నారు. అదీగాక, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్న కేసీఆర్ మార్గరెట్ అల్వాకు మద్దతు ఇస్తారా?  ఇస్తే, అందుకు అయన ఎలాంటి సాకు చూపుతారు అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.  సో .. ఎలా చూసినా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రభుత్వం, అధికార కూటమి కంటే, ప్రతిపక్షాలకే పెద్ద పరీక్షగా నిలిచే అవకాశమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.