Publish Date:Jul 22, 2025
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండవరోజు ఎలాంటి చర్చ లేకుండా వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల ఆందోళన బీహార్లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలతో మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అటు నిరసన హోరుతో సభను రోజంతా వాయిదా వేసి, రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, విపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తూనే సభను నడవనీయకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ ఆందోళనల నడుమ, రాజ్యసభలో షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే లాడింగ్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, లోక్సభలో వాయిదా తీర్మానాలపై చర్చ జరగలేదు.
హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. నగరానికి సెకండ్ ఫేజ్ మెట్రో మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవాళ లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రెండో దశ గురించి ఎంపీ చామల మాట్లాడారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగా నగరం అని ఇది దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతోందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/parliament-25-202483.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.