పిల్లలు సంస్కారంగా ఉండాలంటే తల్లిదండ్రులు  ఈ విషయాలలో ప్రవర్తన మార్చుకోవాలి..!

Publish Date:Oct 1, 2024

Advertisement



పిల్లల పెంపకం ఓ కళ అని అంటారు.  చాలా మంది పిల్లల పెంపకం విషయంలో ఫెయిల్ అవుతుంటారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను జాగ్రత్తగానే పెంచుతుంటాం అని అనుకుంటారు. కానీ పిల్లలు పెరిగి పెద్దయ్యి వారు బాధ్యతగా మారాల్సిన సమయంలో వారి ప్రవర్తనలో ఉన్న తప్పొప్పులు తల్లిదండ్రుల దృష్టిలో పడుతుంటాయి.  కాలం గడిచిపోయాక పిల్లలను మార్చాలన్నా మార్చలేరు.  పిల్లలు చిన్నతనం నుండే సంస్కారంగా ఉండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తనలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాలి. అలా చేస్తే పిల్లలు మంచి విలువలతో పెరుగుతారు. చాలా వరకు పిల్లలు తల్లిదండ్రుల నుండే అన్నీ నేర్చుకుంటారు.  వారికి ఇల్లే తొలి బడి అవుతుంది. తల్లిదండ్రులే మొదటి గురువులు,  మొదటి రోల్ మోడల్స్  అవుతారు.  అందుకే  తల్లిదండ్రులు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుంటే..

దయ..

తల్లిదండ్రులు ఆధిపత్య దోరణి వదులుకోవాలి.  పిల్లల పట్ల అయినా, బయటి వ్యక్తుల పట్ల అయినా ఆధిపత్య ధోరణిలో ఉండటం మంచిది కాదు.  తల్లిదండ్రులు ఆధిపత్య ధోరణిలో ఉంటే పిల్లలు కూడా దాన్నే అలవర్చుకుంటారు.   అందుకే ఆధిపత్య ధోరణికి బదులు ఇతరుల ముందు దయతో మాట్లాడాలి. ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి. ఇతరులకు సహాయం చేయాలి.  పిల్లలు కూడా ఇవే అలవాటు చేసుకుంటారు.

షేరింగ్..

తమకు ఉన్నదాన్ని ఇతరులకు పంచడం తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాల్సిన ముఖ్య లక్షణం. కుటుంబ సభ్యులతో అయినా,  బయటివారితో అయినా  షేరింగ్ అనే అలవాటు ఫాలో అవుతుంటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. లేకపోతే పిల్లలు కుటుంబం,  పాఠశాల నుండి పెద్దయ్యే కొద్దీ ఎవరికీ ఏమీ పంచుకోవడం అనేది లేకుండా స్వార్థంగా తయారవుతారు. ఇది వారి జీవితానికి చాలా నష్టం చేకూరుస్తుంది. అందుకే తల్లిదండ్రులు షేరింగ్ ను అలవాటు చేసుకోవడం ద్వారా పిల్లలకు కూడా దాన్ని అలవాటు చెయ్యాలి.

ఎమోషన్స్..

తల్లిదండ్రులు కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటి భావోద్వేగాలను వదిలేయాలి.  పిల్లల ముందు వీటిని ఎప్పుడూ బయట పెట్టకూడదు. భావోద్వేగాలను ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు బయటపెట్టకుండా వాటిని నియంత్రించుకుంటూ ఉంటే పిల్లలు కూడా భావోద్వేగాల పట్ల నియంత్రణలో ఉండగలుగుతారు.   భావోద్వేగాలను నియంత్రించుకోవడం వల్ల వారి జీవితంలో చాలా విషయాలు సవ్యంగా సాగిపోతాయి.  

వినడం..

తల్లిదండ్రులు పిల్లలు అయినా, ఇతరులు అయినా చెప్పేది శ్రద్దగా,  ఓపికతో వినాలి. అలా వింటూంటే పిల్లలు కూడా ఏ విషయాన్ని అయినా శ్రద్దగా వినడాన్ని అలవాటు చేసుకుంటారు.  లేకపోతే తనకు అవసరమైనది, తాను చెప్పాలనుకున్న విషయం పట్ల మాత్రమే పిల్లలు దృష్టి పెడతారు.  ఇది పిల్లలకు మంచిది కాదు.

థాంక్స్..

ఇతరులకు కృతజ్ఞత చెప్పడం చాలా గొప్ప గుణం.  చిన్న సహాయం అయినా, పెద్ద సహాయం అయినా ఎదుటివారికి కృతజ్ఞత చెప్పడం వల్ల పిల్లలు కూడా దాన్నే అలవాటు చేసుకుంటారు.  ఇది వారిలో గొప్ప విలువలు పెంచుతుంది.


                                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.