పరాన్న జీవి -ఆర్జీవి

Publish Date:May 12, 2023

Advertisement

రాముడిని, గోపాలుడిని కలిపి ఒకడిగా అవతరించిన రూపం రామగోపాలవర్మ. ఈయనను అందరూ అర్జీవీ అని పిలుచుకుంటారు. బహుశా ప్రపంచంలో  యింత కన్ఫ్యూజన్ క్యారెక్టర్ మరోకటి ఉండదేమో అనినిస్తుంది అర్జీవీని చూస్తే. అసలే కన్ఫ్యూజన్ లో ఉండే ఈ పెద్ద మనిషి అందరినీ కన్ఫ్యూజన్ లో పెట్టడంలో బిజీగా ఉంటాడు.

అప్పుడెప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం ఒక సినిమా తీసి పాపులర్ అయిన రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ ని కొంత కాలం కొనసాగించారు. టాలీవుడ్, బాలీవుడ్ లలో కొన్ని గొప్ప సినిమాలు తీసిన ఆర్జీవీ తరువాత తన విపరీత మనస్తత్వానికి పదును పెట్టాడు. సినిమాలు తప్ప అన్ని విషయాలపై తన మేధస్సును ప్రపంచానికి పంచే పని మొదలు పెట్టాడు.  మొదట్లో జనాలకు ఆయన ధోరణి నచ్చింది కానీ క్రమంగా విద్యావంతులు, ఆలోచనాపరులు ఆర్జీవీ వాదలను వ్యతిరేకించడం మొదలైంది. తన సినిమాలను చూడండని తానెప్పుడూ ప్రేక్షకులను కోరలేదని బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చే రామ్ గోపాల్ వర్మ, తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కూడా పాపులారిటీగా  తీసుకున్నాడు. చిరంజీవి, శ్రీదేవి లాంటి పెద్ద స్టార్లతో సినిమా మొదలు పెట్టి ఆపేసిన ఆర్జీవీ  తాను తీసిన సినిమాల కంటే ఆపేసినవే ఎక్కువ అని చెబుతుంటారు. 

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఏ విషయాన్నీ ఆర్జీవీ వదిలి పెట్టడం జరగదు. అలాగే రాజకీయాలలో ఎవరు ఎలాంటి  ప్రకటన చేసినా రామ్ గోపాల్ వర్మ నోరు విప్పక మానడు. రాంగోపాల్ వర్మ అంటే ఎందరికో వినోదం. కొందరికి అసహ్యం. కొద్ది మందికి అవసరం అనేది అందరికీ తెలిసిన అక్షర సత్యం. 2019 ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి కథతో సినిమా తీసి చంద్రబాబును ఇరుకున పట్టాలన్నా, పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడినా దానిపై సెటైర్లు వేయాలన్నా అది రాంగోపాల్ వర్మకే సాధ్యం. ఆర్జీవీ చేసేప్రతి పనికీ ఒక ప్యాకేజీ ఉంటుందని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారు.

అడవి దొంగ వీరప్పన్ తనకు ఆదర్శం అని బాహాటంగా చెప్పే అర్జీవీ నిజ  జీవితంలో కూడా అలాంటి వ్యక్తులనే సమర్ధిస్తుంటాడు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.

సహజంగా పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన వారిని ఆయన అభిమానులు వదిలిపెట్టరు, కానీ తాజాగా పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహించినట్లుగా ఎక్కడా కనిపించలేదు. కారణం ఆర్జీవీని పట్టించుకోకపోవడమే సరైన జవాబు అని జనసేన భావించడమే  ఆ పార్టీ శ్రేణులు చెప్పడం ఆర్జీవీ ప్రస్తుత స్థితిని అద్దం పడుతోంది. 

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.