Publish Date:Sep 22, 2025
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి సొమ్ము అవకతవకల కేసును సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ పై అభియోగాలను కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపివేసిన హైకోర్టు ఈ కేసును విచారించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా సీఐడీని ఆదేశించింది.జగన్ హయాంలో తిరుమల పరకామణిలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పరకామణిలో చోరీచేస్తూ పట్టుబడిన నిందితుడి నుంచి కొన్ని ఆస్తులను టీటీడీకి విరాళంగా అందజేయించి మిగిలిన ఆస్తులను అప్పట్లో టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు వాటాలుగా పంచుకున్నారన్న ఆరోపణల నిగ్గు తేల్చడానికి రంగం సిద్ధమైంది.
కేసు వివరాల్లోకి వెడితే.. తిరుమల పరకామణిలో రవికుమార్ ఓ మఠం తరఫున పనిచేసేవారు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవారు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులలో దాచుకోగా, అనుమానంతో సిబ్బంది తనిఖీలు చేయగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆయనపై అప్పటి ఏవీఎస్వో సతీష్‌కుమార్ ఫిర్యాదుతో రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆరోజు రవికుమార్ వద్ద లభ్యమైనవి 900 డాలర్లు వాటి విలువ అప్పట్లో అప్పట్లో 72 వేల రూపాయలుగా తేల్చారు. అంతకు ముందు చాలా కాలం నుంచీ కూడా రవికుమార్ పరకామణిలో కోట్ల రూపాయలు కాజేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే రెడ్ హ్యాండెడ్ గా రవికుమార్ దొరికిపోయిన తరువాత కొందరు వైసీపీయులు, అప్పటి టీటీడీలో పని చేస్తున్న కొందరు అధికారులు, పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేసి తమ్మిని బమ్మిని చేసి కేసు నీరుగారిపోయేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పరకామణిలో కాజేసి రవికుమార్ సంపాదించిన ఆస్తులలో కొన్నిటిని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా రాయించి, మిగిలిన వాటిని బినామీల పేరిట స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానే నిందితుడు రవికుమార్ ను అరెస్టు చేయకుండా ఆ కేసును లోక్ అదాలత్ లో పెట్టి రాజీ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాడు లోక్ అదాలత్ రవికుమార్ పై కేసు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేసి.. సీఐడీ విచారణకు ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/parakamani-scam-case-to-cib-39-206638.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది