పరకామణి చోరీపై జగన్ కామెంట్స్...ముప్పేట దాడి షురూ

Publish Date:Dec 5, 2025

Advertisement

 

పరకామణి చోరీపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.  తిరుమల పరకామణి చోరీని..చిన్న చోరీ అనడం చర్చనీయాంశమయ్యాయి. జగన్ వ్యాఖ్యలు దొంగలను సమర్థిస్తున్నాయంటూ కూటమి పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకుతిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 

తిరుమల పరకామణి చోరీని చిన్న చోరీ అన్న జగన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయట. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయంలో దొంగతనం జరిగిందని చెబుతూనే...దేశంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయని...అలానే తిరుమలలో జరిగిందనే విధంగా జగన్‌ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కలియుగ దైవంగా కొలిచే తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీని.... చిన్న చోరీగా జగన్ అభివర్ణించడం రాజకీయ నేతలు, శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. 
 
పరకామణి చోరీ కేసు రాజీపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో చోరీ జరగగా...నిందితుడితో టీటీడీ పెద్దలు రాజీ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ వివాదం సర్దుమణిగింది. కానీ  కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి కేసు రాజీ చేసుకోవడాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

రాజీ కుదర్చుకోవడం చట్ట బద్దం కాదని, నిబంధలకు విరుద్ధంగా నడుచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.  ఈ విషయంపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చోరీ కేసును రాజీ చేసుకోవడం తప్పంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, సీఐడీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. 

ఓవైపు సీఐడీ విచారణ జరుగుతున్న క్రమం...మరోవైపు హైకోర్టులో విచారణ దశలో ఉన్న కేసుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదో చిన్న కేసు అంటూ కేవలం  9 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తుండగా... తమ హయాంలోనే పట్టుకున్నామని...చోరీని తేలిగ్గా చూపే ప్రయత్నం చేయడంపై భక్తులు,సోషల్ మీడియాలో దుమెత్తిపోస్తున్నారు.  అంతేకాకుండా 72 వేల రూపాయల విలువైన డబ్బు చోరీ జరిగితే...దొంగ ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు విలువైన ఆస్తులను స్వామి వారికి రాసిచ్చారని జగన్ చెప్పడాన్ని భక్తులు తప్పుబడుతున్నారట.  72 వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసిన వాడు 14 కోట్ల ఆస్తులను తిరిగి ఇచ్చాడంటే అతడికి అంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై విచారణ జరపాలి కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయట. 

చోరీని తక్కువ చేసి చూపడం దొంగలను సమర్థించడమే అవుతుందని భక్తులు మండిపడుతున్నారట. పరమ పవిత్రంగా భావించి శ్రీవారికి సమర్పించుకున్న మొక్కులు, కానుకలు చోరీకి గురైతే చిన్న చోరీ అంటూ దొంగలకు వత్తాసు పలుకుతూ మరో మహా పాపానికి ఒడిగడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయట.వాయిస్-జగన్ చేసిన కామెంట్స్‌పై రాజకీయంగానూ విమర్శల వేడి పెరిగింది.  దేవదేవుని పరకామణిలో దొంగతనం చేస్తే అదేదో చిన్న దొంగతనమే కదా అని వ్యంగ్యంగా మాట్లాడం చూస్తుంటే బాధకలుగుతుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేవుడి దగ్గర దొంగతనం చేస్తే చిన్న దోంగ తనం అంటూ మాట్లాడిన జగన్‌ సంగతి దేవుడే చూసుకుంటాడని లోకేష్ అన్నారు. పరకామణి చోరీని చిన్న తప్పు అనడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కలియువ వెంకటేశ్వరుడి ఆలయంలో చోరీ చేయడమే మహాపాపం అని అన్నారు. వెంకన్న ఖజానాలో చోరి జరిగితే చిన్న చోరీ అంటావా...బుద్దుందా జగన్ అంటూ బీజేపీ నేతలు ఘాటుగానే విమర్శించారు. 72వేల చోరీ చేసిన వ్యక్తికి 14 కోట్లు ఎలా వచ్చాయో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతలు జగన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం సమర్ధించే విధంగా మాట్లాడుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. దొంగ ఇచ్చిన 14 కోట్ల రూపాయలను టీటీడీ మాజీ ఛైరెమన్ భూమన కరుణాకర్‌ రెడ్డి దానంగా చెప్పుకురావడం మరింత సంచలనంగా మారింది. 

టీడీడీకి ఎవరు దానం ఇచ్చినా...దానంగానే పరిగణిస్తారని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.  దొంగ ఇచ్చారా...మరొకరిచ్చారా అనేది కాదని...ఎవరిచ్చినా తీసుకునే పరిస్ధితి టీటీడీలో ఉందంటూ భూమన కరుణా రెడ్డి మరో వివాదానికి తెరలేపారు జగన్‌ వ్యాఖ్యలతో మరోసారి రాజకీయానికి కేంద్రబిందువుగా తిరుమల పరకామణి ఇష్యూ మారింది. జగన్‌ వ్యాఖ్యలు దొంగను సమర్థించే విధంగా ఉన్నాయంటూ కూటమి పార్టీలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం..జగన్‌ను వెనకేసుకొస్తుండటం..అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోందట.
 

By
en-us Political News

  
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో అన్నారు. ఇందులో త‌న ప‌రువు తీసే కుట్ర దాగి ఉంద‌న్న బీఆర్ నాయుడు.. త‌న‌తో పాటు టీటీడీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిపే య‌త్నం ఉంద‌ని ఆరోపించారు. అందుకే తాను సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించానన్నారు.
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.
2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
లిక్కర్ పాలసీపై తప్పుడు కేసు పెట్టి ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో తనతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు.
వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు.
ఈ కేసులో తాను టార్గెట్ అయ్యాన‌న్నారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని, ఎవరిమీదో ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు. జయలలిత కోర్టు తీర్పుల కారణంగా సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చిన ప్రతిసారీ తన వారసుడిగా పన్నీర్ సెల్వంను సీఎం కుర్చిలో కూర్జోపెట్టడం రివాజు. అటువంటి పన్నిర్ సెల్వం జయలలిత మరణం తరువాత డీఎంకేలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
మద్యం కుంభకోణం పాలసీ రూపకల్పనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ, వారిని నిర్దోషులుగా పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
నారా లోకేష్ ఆత్మీయ విందుపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ డిన్నర్ డిప్లమసీని తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారన్నారు. నారా లోకేష్ గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యేలతో, పార్టీ సీనియర్లతో పెరిగిన దూరాన్ని తగ్గించుకోవడానికి ఆత్మీయ విందును ఒక దౌత్య మార్గంగా లోకేష్ ఎంపిక చేసుకున్నారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.