కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ జీరో బీజేపీ ప్రచారం
Publish Date:Apr 10, 2026
Advertisement
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇంటి పోరు ముదురుతోంది. ఆమె భర్త పరకాల ప్రభాకర్ తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన జీరో బీజేపీ ఇనీషియేటివ్ చేపట్టడం గమనార్హం. చెన్నైలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని అఖిల భారత ప్రజా ఉద్యమ తమిళనాడు సమన్వయ కమిటీ ఉద్ఘాటించింది. జీరో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించిన ఆ కమిటీ... 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చూడటమే లక్ష్యమని పేర్కొంది. ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. జీరో బీజేపీ ’ చాలా ముఖ్యమని, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకే తాను తమిళనాడుకు వచ్చానని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలంతా ఈ సిద్ధాంతం వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రాజ్యాంగ విలువలకు సమాధి కట్టుకోవడమేనన్నారు. ప బీజేపీకి ఓటేస్తే తమిళనాడులో మత సామరస్యం దెబ్బతింటుందని, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవించలేరని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం నాశనమవుతాయని పరకాల హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/parakala-prabhakar--zero-bjp-campaign-in-tamilnadu-25-217108.html





