పరకాల బరిలో కాకతీయ విద్యార్థి సంఘం?
Publish Date:May 9, 2012
Advertisement
వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు తెలంగాణా వాదుల మధ్య విభేదాలకు కారణమైంది. ఇక్కడ పోటీకి బిజెపి, తెలంగాణా టిడిపి, టి.ఆర్.ఎస్. లు తమ అభ్యర్థులను రంగంలోకి దింపబోతున్నాయి. అయితే దీని వల్ల తెలంగాణావాదంలో చీలిక వచ్చి బలహీనపడే ప్రమాదం ఉందని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని పొలిటికల్ జెఎసి నిర్ణయించిన అభ్యర్థికే మిగిలిన అన్ని రాజకీయపార్టీలు మద్దతు పలకాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఒకవేళ ఉమ్మడి అభ్యర్థిని బలపర్చకపోతే తామే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాల్సివస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. కాకతీయ విద్యార్థుల ప్రకటనలను రాజకీయపార్టీలు సీరియస్ గా తీసుకోకపోవటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంరోజుల్లోగా ఆ పార్టీలు తమ వైఖరి వెల్లడి చేయకపోతే విద్యార్థి యూనియన్ కు చెందిన ఎవరో ఒక విద్యార్థిని పొలిటికల్ జెఎసి మద్దతుతో రంగంలోకి దింపాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జాక్ యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు టిడిపి కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి అభ్యర్థి కోసం పట్టుబడుతున్నారు. అయితే దీనికి టి.ఆర్.ఎస్. బిజెపి మద్దతు లభించటం లేదు. దీంతో పరకాల ఉప ఎన్నికల కారణంగా తెలంగాణావాదుల్లో చీలికవచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ లబ్ది పొందే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/parakala-constituency-in-warangal-district-24-13917.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





