ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది.
ఏప్రిల్ లో సర్పంచుల పదవీకాలం ముగుస్తుండడంతో, వెంటనే ఎన్నికల ప్రక్రియ జరిపేందుకు కసరత్తు ప్రారంభించింది. 2026 జనవరి1ని కటాఫ్‌గా తీసుకుని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఫొటో ఓటర్ కార్డుల జాబితాను సిద్దం చేయలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల పంచాయితీల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/panchayat-elections-in-ap-39-213687.html
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.