ప్రపంచాన్ని తలకిందులు చేసిన కుంభకోణం

Publish Date:Apr 5, 2016

Advertisement

 

 

పొలం అమ్మిన డబ్బులను బ్యాంకులో వేసుకుంటే ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపిస్తుంది. ఆటో ముందు చక్రం ట్రాఫిక్ గీత దాటితే అధికారులు చలాన్లను నింపుతారు. కానీ పనామా పేపర్స్ బయటపెడుతున్న వివరాలు చూస్తే, ప్రపంచంలోని నిబంధనలన్నీ పేదవాళ్ల కోసమే రూపొందించినట్లు తోస్తుంది. పనామా పేపర్స్.... పేదవాడి రక్తాన్ని ఉడికిస్తున్న పేరు ఇది. 40 ఏళ్లుగా బడాబాడులు కలిసి బడుగుల నుదుట రాసిన రాత ఇది. దాని కథ ఇది!

 

అమితాబ్, ఐశ్వర్య, జాకీచాన్, ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ, రష్యా అధ్యక్షుడు పుతిన్... ఇదంతా ఏదో ప్రతిభావంతుల జాబితా కాదు! పనామా పేపర్స్ ముసుగు చించిన పన్ను ఎగవేతదారుల చిట్టా. వీరంతా కలిసి తమ ప్రభుత్వాలని మోసం చేసి, విదేశాలలో కోట్లకు కోట్లు దాచుకున్నారన్నది ఈ కుంభకోణంలోని ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది ఎవరో నోరుజారిన రాజకీయవేత్త కాదు. దాదాపు 80 దశాలకు చెందిన 377 మంది జర్నలిస్టులు. ఈ పరిశోధనలో మన దేశానికి చెందిన ఇండియన్ ఎక్సప్రెస్‌కు కూడా భాగస్వామిగా ఉంది. ‘ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్’ అనే అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో సాగిన శోధన ఇది.

 

తరాలు గడిచినా తరగనంత డబ్బున్నవారు, విదేశాలలో తమ నల్లధనాన్ని దాచుకోవడం కొత్తేమీ కాదు. ఇలాంటి నల్లధనాన్ని తమ వద్ద దాచుకోమంటూ కొన్ని చిన్నా చితకా దేశాలు సంపన్నులను ప్రోత్సహిస్తుంటాయి. డబ్బు మీద డబ్బు వచ్చిపడుతుంటే దాన్ని తమ దగ్గర దాచుకోమంటూ ఊరిస్తుంటాయి.  సదరు దేశాల్లో డబ్బు దాచుకుంటే వాటి మీద పన్ను ఉండదు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న అనుమానం ఉండదు. అన్నింటికీ మించి ఈ డబ్బుకి సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించే ప్రశ్నే ఉండదు. ఈ దేశాల్లో నల్లధనాన్ని రెండు రకాలుగా దాచుకుంటారు. ఒకటి- అక్కడి బ్యాంకులలో ఏదో ఒక బినామీ పేరుతో డబ్బుని దాచుకుంటారు. ఈ మాటని వినగానే మనకు స్విస్‌ బ్యాంకులే గుర్తుకువస్తాయి. రోజురోజుకీ ఈ స్విస్ బ్యాంకుల మీద ఆరోపణలు పెరిగిపోవడంతో... ఇప్పుడు రెండో పద్ధతి ద్వారా డబ్బుని దాచుకోవడం మొదలైంది. అదే షెల్ కంపెనీల పద్ధతి.

  

 షెల్ కంపెనీ పద్ధతిలో ఏదో ఒక కంపెనీని చట్టబద్ధంగా సృష్టిస్తారు. ఇక అక్కడి నుంచీ ఆ కంపెనీతో తమ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు. దానికి పెట్టుబడిని సమకూరుస్తున్నట్లుగా బినామీ పేర్లతో భారీ షేర్లను కొనుగోలు చేయించవచ్చు; సదరు కంపెనీ మీద విపరీతమైన లాభాలు వచ్చేసినట్లు చూపించవచ్చు; ఈ చిన్నపాటి కంపెనీ పనితీరు నచ్చేసి ఎవరో విపరీతమైన ధరకు దాన్ని కొనుగోలు చేసినట్లు చూపించవచ్చు... చివరికి డబ్బుని ఒక్కసారిగా మాయం చేయాలంటే, కంపెనీ విపరీతమైన నష్టాల్లో ఉందని చెప్పి మూసేయించవచ్చు. ఈ పద్ధతి ద్వారా కనిపించే లాభనష్టాలు అన్నీ చట్టప్రకారమే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్ని లొసుగులనూ వాడుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.

  

 ప్రస్తుతానికి ఇలాంటి చట్ట’వ్యతిరేక’ సంస్థలకు ప్రాణం పోసే ఓ పెద్ద కంపెనీ గుట్టు రట్టయ్యింది. డబ్బుకి సంబంధించి ఇలాంటి దివాళాకోరు పనులు జరుగుతాయని అందరికీ తెలిసినా, మరీ ఈ స్థాయిలో... ప్రపంచానికి సమాంతరంగా మరో ఆర్థిక ప్రపంచం నడుస్తోందన్న నిజం మాత్రం ఇప్పుడు భయం గొలుపుతోంది. ఒక్క భారతదేశం నుంచే దాదాపు 500 మంది ప్రముఖుల పేర్లు ఈ కుంభకోణంలో వినిపిస్తున్నాయంటే, మనం ఎందరు బుద్ధిజీవుల మద్య బతుకుతున్నామో తెలుస్తోంది. ఇక కమ్యూనిస్టులు అక్రమాలకు పాల్పడరు, ఆఫ్రికాలో పేదరికం తాండవిస్తుంది... వంటి వాక్యాలు కూడా ఈ కుంభకోణంతో వెలవెలబోయాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా కమ్యూనిస్టు నాయకుల పేర్లు ఈ పేపర్లో కనిపించాయి. ఘనా, కాంగో వంటి ఆఫ్రికా దేశాల అధినేతల పేర్లూ ఈ చిట్టాలో చోటు చేసుకున్నాయి.

  

 ఈ కుంభకోణానికి కేంద్రబిందువుగా పనామా నిలిచింది. ఒకప్పుడు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ పనామా కెనాల్‌ను నిర్మించిన ఈ గడ్డ మీదే, ఇప్పుడు నల్లధనం మరో సముద్రమై ప్రవహిస్తూ కనిపించింది. ఈ దేశంలో ఉన్న మొస్సాక్ ఫోన్సెకా అనే ఓ సంస్థ, వాణిజ్య సేవల పేరుతో, నల్లధనాన్ని ఎలా చట్టబద్ధంగా మార్చుకోవాలో ఈ సంస్థ సూచిస్తున్నట్లు తేలింది. 1977లో ఈ సంస్థ ఏర్పాటైన దగ్గర్నుంచీ గడచిన నాలుగు దశాబ్దాలో ఈ కళలో మొస్సాక్‌ ఫోన్సెకా ఆరితేరిపోయింది. వ్యాపారస్తుల దగ్గర్నుంచీ దేశాధ్యక్షుల వరకూ నల్లధనానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా తన వైపు చూసే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. కానీ పాపం పండక తప్పలేదు. ఒళ్లు మండిన మాజీ ఉద్యోగి ఎవరో మొస్సాక్ ఫోన్సెకాకు సంబంధించిన వ్యవహారాన్నంతా బట్టబయలు చేయడంతో నిష్టురమైన నిజాలన్నీ ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చాయి.

    

రాబోయే రోజులలో ఈ కుంభకోణంలో మరిన్ని పేర్లు బయటపడవచ్చు. ప్రభుత్వాలకు ప్రభుత్వాలే కూలిపోవచ్చు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న పనామా పేపర్స్ ద్వారా ఏదైనా జరగవచ్చు. కానీ ఒక్కటిమాత్రం వాస్తవం! ఒకవైపు ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే... కోట్ల కొద్దీ రూపాలయను దర్జాగా దాచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు ఎలా కల్పించగలుగుతున్నాయి? రూపాయి రూపాయికీ లెక్కలు అడిగి పన్నులు వసూలు చేసే వ్యవస్థలు, పెద్దవారిని చూసీ చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నాయి? ఈ ప్రశ్నలకి కనుక సరైన సమాధానం లభించకపోతే, రగులుతున్న పేదవాడి మనసు పగలక మానదు. అప్పుడు వచ్చే విప్లవం ముందు ఫ్రాన్స్‌, రష్యా విప్లవాలు సైతం చిన్నబోతాయి. అలాంటి పరిస్థితి రాకుండానే, ప్రభుత్వాలు కళ్లు తెరవాలని కోరుకుందాం.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.