పాక్ పరిస్థితి.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.!
Publish Date:Jul 17, 2026
Advertisement
పాకిస్థాన్ పరిస్థితి చేతి దగ్గరకొస్తే చేతి దెబ్బ, కాలిదగ్గరకొస్తే కాలి దెబ్బ అన్నట్లు తయారైంది. స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎడా పెడా వ్యూహాల పేరిట ఇరుగుపొరుగు దేశాలను ఇబ్బందుల పాల్జేయాలని చేసిన ప్రయత్నాలే ఇప్పుడు ఆ దేశ పరిస్థితి సాలిగూడులో చిక్కుకున్న ఈగ మాదిరిగా తయారవ్వడానికి కారణమయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, . యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య మొదలైన కొత్త ఘర్షణ పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్.. తన స్వార్థపూరిత వ్యూహాల వల్ల ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక నిండా మునిగిపోతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్‌కు ఈ సంక్షోభం అగ్నిపరీక్షగా మారింది. ఇటీవల అంటే గత నెల 13న యెమన్‌లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై సౌదీ అరేబియా క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ నుండి హౌతీ తిరుగుబాటుదారులకు ఆయుధాలు తీసుకువెడుతున్న విమానాన్ని అడ్డుకునే క్రమంలో సౌదీ ఈ దాడికి పాల్పడింది. దీనికి ప్రతీకారంగా హౌతీలు సౌదీ అరేబియాలోని అభా అంతర్జాతీయ విమానాశ్రం లక్ష్యంగా ఎదురుదాడికి దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు ఇరాన్, అటు సౌదీ అరేబియా రెండింటి నుంచి భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందిన పాకిస్తాన్ ఎటూ చెప్పలేక.. ఎవరినీ సమర్ధించలేక, సర్ది చెప్పలేక సతమతమౌతోంది. గతంలో ఆర్థిక సాయం కోసం పాకిస్తాన్ సౌదీ అరేబియాతో భారీ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రక్షణ పరంగా అవసరమైన వేళల్లో అండగా నిలుస్తామని అప్పట్లో అసీమ్ మునీర్ చెప్పారు. క ఇప్పుడు యెమన్‌లోని షియా హౌతీ గ్రూపుల వెనుక ఉన్న ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీకి మద్దతు ఇవ్వలేని పరిస్థితి పాకిస్థాన్ ది. ఎందుకంటే.. పొరుగున ఉన్న ఇరాన్ తో శత్రుత్వం పెంచుకునేందుకు పాక్ సిద్ధంగా లేదు. ఎందుకంటే గతంలో ఇరాన్‌కు కూడా పాకిస్తాన్ రక్షణ కవచంగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇటు సౌదీ, అటు ఇరాన్ రెండింటిలో ఏ దేశం వైపూ మొగ్గు చూపే ధైర్యం లేక ఇరు దేశాల ఆగ్రహానికీ పాకిస్థాన్ గురౌతుననది. అదలా ఉంటే.. పాకిస్థాన్ స్వయంగా.. ఒక వైపు బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటాలు, మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే లో తీవ్ర ప్రజా వ్యతిరేకత.. మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నిత్యం కాల్పుల మోత.. ఇలా ముప్పేట దాడిలో ఉక్కిరిబిక్కిరౌతోంది. కేవలం తక్షణ ఆర్థిక ప్రయోజనాల కోసం దేశ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టి అగ్రరాజ్యాలు, ధనిక దేశాల వద్ద మోకరిల్లడం వల్లే పాకిస్తాన్‌కు ఈ గతి పట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సౌదీ లేదా ఇరాన్.. ఈ రెండింటిలో పాకిస్తాన్ ఏ ఒక్కరి వైపు నిలిచినా, తటస్థంగా ఉన్నా.. తీసుకున్న రుణాల చెల్లింపునకు ఆ దేశాలు ఒత్తిడి పెంచడం ఖాయం. ఇప్పటికే సౌదీ బకాయిలు చెల్లించాలన్న అల్టిమేటమ్ ఇచ్చింది. ఈ పరిస్థితుల నుంచి పాకిస్థాన్ ఎలా బయటపడుతుందో చూడాలి. ఇప్పటికే పాకిస్థాన్ లోని రాజకీయ పార్టీలు సైనిక విధానాలపై కత్తులు నూరుతున్నారు. ప్రజాస్వమ్య విధానమే శరణ్యమని రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో దేశంపై సైనిక పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో సైనిక పెత్తనానికి ఎండ్ కార్డ్ పడి.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగడమొక్కటే ఆ దేశం సంక్షోభం నుంచి బయటపడడానికి మిగిలిన ఏకైక మార్గంగా పరిశీలకులు చెబుతున్నారు. Pakistan Saudi Arabia, defense pact, Asim Munir under pressure, Saudi Yemen Houthi conflict, Pakistan foreign policy, Iran Yemen airstrikes Telugu news
http://www.teluguone.com/news/content/pakistan-saudi-arabia-36-226295.html





