పాక్ లో సైనిక తిరుగుబాటు?
Publish Date:Aug 7, 2026
Advertisement
పాకిస్థాన్ లో మరోసారి సైనిక తిరుగుబాటు ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే అవకాశాలున్నాయా? అంటే పరిశీలకులు ఆ దేశంలో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టం అంటున్నారు. సైనిక పాలన, రాజకీయ సంక్షోభాలు పాక్ లో సాధారణమంటున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వం లోని ప్రభుత్వాన్ని కూల్చివేసి, సైన్యం దేశ అధికార పగ్గాలను చేతుల్లోకి తీసుకో బోతోందంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలీ ప్రచారానికి కారణమేంటంటే.. పాకిస్థాన్ హోంమంత్రి హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు. ఆయన ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎకనామిక్ సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో గత ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. , దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని తాను బయటపెట్టానని, అందులో ప్రముఖ రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇంతకీ ఈ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్‌కు సన్నిహితుడిగా, సైన్యానికి ఆత్మీయుడిగా గుర్తింపు పొందారు. అటువంటి వ్యక్తి బాహాటంగా వ్యవస్థ విఫలమైందని అనడంతో షెహబాజ్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సైన్యం సమాయత్తమౌతోందన్న ప్రచారం ప్రారంభమైంది. అయితే ఆ తరువాత మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పూర్తిగా సురక్షితంగా ఉందని, మిలిటరీ కూప్ ముప్పు లేదనీ క్లారిటీ ఇచ్చినా ఊహాగానాలు ఆగలేదు. నఖ్వీ వ్యాఖ్యలు పాక్ ప్రభుత్వంలోనే కలకలం రేపాయి. షెహబాజ్ షరీఫ్ కేబినెట్లోని సహచర మంత్రులు నఖ్వీపై విమర్శలు గుప్పించారు. దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అయితే.. నఖ్వీనీ జవాబుదారీ తనం లేని వ్యక్తిగా అభివర్ణించారు. అలాగే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేతలు నఖ్వీ రాజీనామా డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వంలోనే ఈ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత రావడంతో సైనిక తిరుగుబాటు వార్తలకు, ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. దీంతో నఖ్వీ మరింత వెనక్కు తగ్గి.. వ్యవస్థ కూలిపోయింది అనే వ్యాఖ్యలు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గురించి కాదని క్లారిటీ ఇస్తూ.. గత ఎనిమిది దశాబ్దాలుగా దేశంలో పాతబడిపోయిన పాలన, బ్యూరోక్రసీ లోపాల గురించే తాను మాట్లాడానన్నారు. అక్కడితో ఆగకుండా ప్రధాని షెహబాజ్ షరీఫ్ పనితీరుపై పొగడ్తల వర్షం కురిపించారు. Pakistan Military Coup Rumors, Shehbaz Sharif Government, Mohsin Naqvi Statement, General Asim Munir, Pakistan Politics News, Islamabad Power Struggle
http://www.teluguone.com/news/content/pakistan-military-coup-rumors-36-228343.html





