సౌదీలో మోహరించిన పాక్ సైనిక బలగాలు

Publish Date:May 18, 2026

Advertisement

 పశ్చిమాసియాలో మరోసారి  ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏ క్షణమైనా   యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనలు   వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇరాన్ జరిపిన దాడుల వల్ల గల్ఫ్ రీజియన్‌లో అభద్రతాభావం పెరిగింది. ముఖ్యంగా సౌదీ అరేబియాకు చెందిన కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో ఒక సౌదీ పౌరుడు కూడా మరణించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును,  దాడులను తిప్పికొట్టేందుకు గల్ఫ్ దేశాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే, సౌదీ అరేబియాకు రక్షణగా పాకిస్థాన్ తన సైన్యాన్ని,  అత్యాధునిక యుద్ధ విమానాలను భారీ స్థాయిలో రంగంలోకి దించింది.  సౌదీ అరేబియా రక్షణ అవసరాల కోసం పాకిస్థాన్ 8వేల నుంచి 13వేల  మంది వరకు సైనిక బలగాలను సౌదీకి  పంపింది. కేవలం భూతల సైనికులను మాత్రమే కాకుండా.. శత్రుదేశాల వైమానిక దాడులను అడ్డుకోవడానికి వీలుగా పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన  జేఎఫ్‌-17   ఫైటర్ జెట్లను, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లను,  అత్యాధునిక హెచ్‌క్యూ-9  ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా సౌదీలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్ బేస్‌కు తరలించింది.  

 భవిష్యత్తులో అవసరమైతే గరిష్టంగా 80 వేలమంది వరకు పాక్ సైనికులను, అలాగే యుద్ధ నౌకలను కూడా సౌదీకి పంపేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ప్రస్తుతానికి ఈ సైనిక, వైమానిక దళాలు ప్రధానంగా రక్షణ, సలహా, శిక్షణా పాత్రలను పోషిస్తాయి.  వాస్తవానికి, అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి, కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడానికి ఇస్లామాబాద్ వేదికగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలో సుమారు 21 గంటల పాటు సాగిన ఈ శాంతి చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. 

చర్చలు విఫలమైన తరుణంలోనే, పాకిస్థాన్ తన వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని అమలులోకి తెచ్చింది. ఇరాన్‌తో పాకిస్థాన్‌కు సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ మిత్రదేశాలతో ఉన్న వ్యూహాత్మక బంధానికే ఇస్లామాబాద్ మొగ్గు చూపింది.  గత ఏడాది సెప్టెంబర్ 17, 2025న సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఒక చారిత్రాత్మక 'స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్  కుదిరింది. నాటో ఆర్టికల్ 5 తరహాలోనే, ఈ ఒప్పందం ప్రకారం ఒకరిపై జరిగే దాడిని ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యల ప్రకారం.. ఈ ద్వైపాక్షిక ఒప్పందం వల్ల సౌదీ అరేబియా దేశం పాకిస్థాన్  అణు కవచం   పరిధిలోకి వస్తుంది. గతంలో పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు సౌదీ అరేబియా,  ఖతార్ దేశాలు సుమారు 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకున్నాయి. దానికి ప్రతిఫలంగా, ఇప్పుడు సౌదీకి భద్రతా పరమైన ముప్పు పొంచి ఉన్న సమయంలో పాకిస్థాన్ తన అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో అండగా నిలిచింది. ఈ భారీ సైనిక మోహరింపు పశ్చిమాసియా రాజకీయాలలో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది.  

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.