ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. ఇండియా అంతు చూస్తామంటూ హెచ్చరిక.!

Publish Date:Aug 13, 2026

Advertisement

పాకిస్థాన్ రాజకీయ నాయకులకు, ఉగ్రవాదులకు ఉన్న అనుబంధం మరో సారి వెల్లడైంది. ఆ దేశ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్  అహ్మద్ ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నారు. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్ర నేతలతో ఒకే వేదికపై ప్రత్యక్షమైన 

పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకులతో కలిసి ఒకే వేదికపై ప్రత్యక్షమైన ఆయన షేక్ రషీద్ అహ్మద్ ఇండియాపై విషం కక్కారు. విద్వేష పూరిత వ్యాఖ్యతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ మాజీ మంత్రి,  రాజకీయ నాయకుడు ఉగ్రవాదులతో ఒకే వేదికపై కూర్చుని భారత్ అంతు చూస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.  

  ఒక బహిరంగ సభలో షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.    భారత్ గనుక పాకిస్థాన్ వైపు కన్నెత్తి చూస్తే..  ఆ దేశాన్ని దేవుడు నాశనం చేస్తాడంటూ శాపనార్ధాలు పెట్టారు. భారత్‌పై దాడి జరిగితే అక్కడ పక్షులు  కూయవని, ఆలయాల్లో గంటలు డా మోగవనీ  హెచ్చరికలు జారీ చేశారు.

గతంలో తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో తన  ఫోన్‌లో హఫీజ్ సయీద్ ఫోన్ నంబర్ ఉండటంతో  అమెరికా అధికారులు తనను ఆ దేశం నుంచి బహిష్కరించారని రషీద్  స్వయంగా వెల్లడించారు.  ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు  మంత్రిగా షేక్ రషీద్ కీలక బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఒక వైపు అంతర్జాతీయ వేదికలపై తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని పాక్ ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ..  మరో వైపు  ఆ దేశ మాజీ మంత్రి ఉగ్రవాదులతో వేదికలు పంచుకోవడం పాక్ నైజానికి ప్రత్యక్ష నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రషీద్ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

Pak terror relations exposed, Sheikh Rashid Ahmed, Hafiz Saeed, Lashkar e Taiba, Pakistan Former Minister, TeluguOne 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు.
సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..!
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనతో అట్టుడుకుతోంది. మట్టిలో కలిసిపోతున్న ఆశలు, కళ్ళముందే జరుగుతున్న అన్యాయం చూసి కన్నీళ్లు పెడుతున్నారు
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.