అమెరికా అధీనంలో పాక్ ఎయిర్ బేస్ లు.!

Publish Date:Jul 16, 2026

Advertisement

పాకిస్థాన్ లోని కీలక వైమానిక స్థావరాలన్నీ అమెరికా అధీనంలో ఉన్నాయా? అంటే అంతర్జాతీయ మీడియా కథనాలు ఔననే అంటున్నాయి.  ఒక వైపు తీవ్ర  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్..  దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం. ముఖ్యంగా ఆసియా ఖండంలో చైనా, ఇండియా  ప్రాబల్యాన్ని గమనిస్తూ..  తన సొంత భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం అమెరికా ఈ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు.. పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఆ దేశంపై తెచ్చిన ఒత్తిడులు సత్ఫలితాలను ఇచ్చాయని రక్షణ రంగ నిపుణులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొది. 

ఈ   మార్పులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పాకిస్తాన్   భూభాగంలోని వ్యూహాత్మకమైన మూడు వైమానిక స్థావరాలు పూర్తిగా అమెరికా సైనిక దళాల   నిర్వహణలో ఉన్నాయి.   పాకిస్తాన్ నిఘా సంస్థ   ఐఎస్ఐ  మాజీ అధినేత ఈ విషయాన్ని స్వయంగా స్వయంగా ధృవీకరించినట్లు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అమెరికా అధీనంలోకి తీసుకున్న స్థావరాలలో ప్రముఖమైనది నూరు అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్.  ఈ రక్షణ కేంద్రం భౌగోళికంగా పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైనది. అమెరికా సైన్యం ఈ ప్రాంతాలను తమ సొంత నియంత్రణలోకి తీసుకున్నప్పటి నుండి అక్కడ కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేస్తోంది.  ఈ ఎయిర్ బేస్‌ల అంతర్గత పరిసరాల్లోకి కనీసం పాకిస్తాన్   సైనికులు ఉన్నతాధికారులకు కూడా అనుమతి లేదు. 

ఈ వ్యూహాత్మక సైనిక మోహరింపు వెనుక కేవలం భూభాగాన్ని ఆక్రమించడం మాత్రమే కాకుండా..  భారీ సైనిక వ్యూహం దాగి ఉందని రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం.   అమెరికా అధీనంలో ఉన్న నూరు అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌లో వాషింగ్టన్   అధునాతనమైన ఎఫ్ 35,  ఎఫ్ 16 ఫైటర్ జెట్‌లను పెద్ద సంఖ్యలో మోహరించింది.  పాకిస్తాన్ కలిగి ఉన్న అత్యంత రహస్య అణ్వాయుధ నిల్వ కేంద్రాలకు ఈ వైమానిక స్థావరం చాలా సమీపంలో ఉండట వల్లే.. దీనిపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోంది.  దీని ద్వారా పాక్ అణ్వాయుధాల గమనాన్ని,  వాటి నిల్వలను నిరంతరం నిఘా నీడలో ఉంచడం అమెరికాకు సులువవుతుంది.

 పాకిస్తాన్  ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలోనే ఇరు దేశాల మధ్య రహస్య రక్షణ ఒప్పందాలు కుదిరిందన్నది అంతర్జతీయ మీడియా కథనాల సారాంశం. అంతేకాకుండా..  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుబంధ కంపెనీలకు పాకిస్తాన్ భూభాగంలోని విలువైన ఖనిజ సంపదను తవ్వుకునేందుకు అనూహ్యంగా అనుమతులు కూడా మంజూరయ్యాయి.  ఈ ఆర్థిక,  వ్యూహాత్మక లొంగుబాట్లు జరిగినప్పుడే, పాకిస్తాన్ భవిష్యత్తు పూర్తిగా అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయిందనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తీవ్రమైన  ద్రవ్యోల్బణం, విదేశీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్, అమెరికా ఇచ్చే రుణ సహాయాల కోసమే తన దేశ రక్షణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని అంటున్నారు.  

 అయితే.. పాకిస్తాన్,  అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు కొత్తవేమీ కావు. కాకపోతే, గతంలో కేవలం ఉగ్రవాద నిర్మూలన లేదా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల కోసమే పరిమితమైన ఈ సంబంధాలు, ఇప్పుడు పాక్ సొంత స్థావరాలపై అమెరికా అధిపత్యం చెలాయించే స్థాయికి చేరడం గమనార్హం.  గతంలో అమెరికా తన డ్రోన్ దాడుల కోసం పాక్ వైమానిక స్థావరాలను వాడుకున్నప్పటికీ..  పాక్ సైనికులను కూడా నిరోధించే  పరిస్థితి లేదు.

కానీ ప్రస్తుత విదేశీ విధానాలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత సమస్యల కారణంగా దాయాది దేశం పాకిస్థాన్ బేరసారాల శక్తిని కోల్పోయింది. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం పాకిస్థాన్ అమెరికా ముందు మోకరిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆసియాలో చైనాను కట్టడి చేసే నెపంతో పాకిస్తాన్‌ను అమెరికా ఒక పావుగా వాడుకుంటోందనేది   బహిరంగ రహస్యంగా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వం తన స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం చేసిన ఈ ఒప్పందాలు, దీర్ఘకాలంలో ఆ దేశ ఉనికికే ప్రమాదకరంగా మారే  ప్రమాదం పొంచి ఉందంటున్నారు.  

US Military Presence Pakistan, US Pakistan Strategic Relations, Pakistan Nuclear Weapons Storage, Former ISI Chief Revelations

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.