పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు

Publish Date:Dec 15, 2025

Advertisement

 

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఈ-తోయిబా ది రెసిస్టెన్స్ ఫ్రంట్  ఉగ్రసంస్థతో పాటు మరో ఆరుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. పాక్ కుట్ర, నిందితుల పాత్రలు, ఆధారాలతో కూడిన ఈ ఛార్జిషీట్‌లో నిషేధిత ఉగ్రసంస్థను ఒక చట్టబద్ధ సంస్థగా గుర్తించి, పహల్గామ్ దాడిని ప్రణాళికాబద్ధంగా రూపొందిం చడం, సహకరిం చడం, అమలు చేయడంలో వారి పాత్ర ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది. 

పాక్ మద్దతు తో జరిగిన ఈ ఉగ్రదాడిలో మత ఆధారిత లక్ష్య హత్యలు చోటు చేసుకోగా, 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పో యారు.1,597 పేజీలతో కూడిన ఈ ఛార్జిషీట్‌ను జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేశారు. ఇందులో పాకిస్థాన్ హ్యాండ్లర్ ఉగ్రవాది సజీద్ జట్ పేరును కూడా నిందితుడిగా చేర్చారు. అలాగే, 2025 జూలైలో శ్రీనగర్‌లోని డాచిగాం ప్రాంతంలో ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పొందుపరి చారు. 

వారు ఫైసల్ జట్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు. తో పాటు పై నలుగురు ఉగ్రవాదులపై భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టం–1959, అక్రమ కార్య కలాపాల నివారణ చట్టం 1967 కింద అభియోగాలు నమోదు చేశారు. అంతేకాకుండా, భారత్‌పై యుద్ధం ప్రకటించిన నేరం కింద కూడా శిక్షార్హ సెక్షన్లను ఎన్‌ఐఏ ప్రయోగించింది. గత దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన శాస్త్రీయ, సుదీర్ఘ దర్యాప్తులో కేసులోని ఉగ్ర కుట్ర పాకిస్థాన్ నుంచే రూపుదిద్దుకున్నదని ఎన్‌ఐఏ తేల్చింది. 

భారత్‌పై నిరంతరం ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది.ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై 2025 జూన్ 22న అరెస్టయిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జొథాత్ద్‌లపై కూడా ఛార్జిషీట్ దాఖలైంది. విచారణలో వారు దాడిలో పాల్గొన్న ముగ్గురు ఆయుధధారుల వివరాలు వెల్లడించడంతో పాటు, వారు నిషేధిత  ఉగ్రసంస్థకు చెందిన పాకిస్థాన్ పౌరులేనని నిర్ధా రించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.

By
en-us Political News

  
బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని డిపోల ముందు డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో చేరి నిరసలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్ లు, బస్ స్టేషన్లు బోసిపోయాయి. ఇక హైదరాబాద్ లో అయితే సిటీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనాథల రాతను మారుస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ సంధించిన అక్షరాయుధం నెల్లూరులో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. మున్సిపల్ స్కూల్స్ భవనాలు చూసి ముగ్ధులై, భిక్షా పాత్రలను విసిరికొట్టి పుస్తకాలు పట్టిన ఆ చిన్నారుల పట్టుదల, నేడు వారిని సమాజం గర్వపడే హీరోలుగా నిలబెట్టింది.
వీరు ఒక వ్యక్తిగత కుటుంబ వివాదాన్ని ఆధారంగా చేసుకుని బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి సి ఐ ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారనీ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పరుగుల వరద పారించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోశాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్37 పరుగులు, ఇషాన్ కిషన్ పాతిక పరుగులు చేశారు. చివరిలో హెన్రిచ్ క్లాసెన్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించి 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
కేరళలోని త్రిస్సూర్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఓ మైనర్ బాలుడు తన స్నేహితుల మాదిరిగా రీల్స్ చేసి గుర్తింపు పొందాలని ఆశపడ్డాడు. కానీ అదే ఆలోచన చివరకు అతని ప్రాణాన్ని బలి తీసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక మామిడి తోట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందని కుటుంబం ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే పరిమితమైంది.
త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగనున్నాయన్న చర్చతో వినియోగదారుల్లో గుబులు రేగుతోంది.
హిమాలయ పర్వతాల మధ్య విరాజిల్లుతున్న పవిత్ర క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం రేపు ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకోనుంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకలో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
వరంగల్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.