పహల్గాం ఎఫెక్ట్.. అసియా కప్‌కు భారత్ దూరం?
Publish Date:May 3, 2025
Advertisement
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ కీలక పాత్ర పోషించిందనే విమర్శలు వచ్చాయి. క్రీడా సంబంధాలపైనా ఆ ఎఫెక్ట్ పడనుందని.. క్రికెట్ సహా ఇతర క్రీడల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్‌లోనూ ఇరు జట్ల మధ్య సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఈ విషయంలో ఐసీసీ కూడా దృష్టిపెట్టాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. దీంతో ఆసియా కప్ లోనూ భారత్ పాల్గొనడంపై ఇప్పుడు అనుమానాలు వెల్లువెత్తాయి. టోర్నీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ఆసియా కప్ సాధారణంగా తటస్థ వేదిక పైనే నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంకా షెడ్యూల్‌ను ప్రకటించలేదు. బంగ్లాదేశ్ సిరీస్ అనంతరం సెప్టెంబర్‌లో వేదికను నిర్ణయించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆసియా కప్ వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ - పాక్ ల మధ్య ఇప్పుడు సంబంధాలు సరిగ్గా లేవు. ఇలాంటి దశలో నిర్వహించే అవకాశాలు తక్కువేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడేందుకు భారత్ అక్కడికి వెళ్లాల్సిఉంది. అయితే, బంగ్లా పర్యటనకూ టీమ్‌ఇండియా వెళ్లే అవకాశం తక్కువేనని సమాచారం. ఐసీసీ క్యాలెండర్ ఇయర్‌లో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు చోటుంది. కానీ, దానిని కొనసాగించే ఛాన్స్‌లు కనిపించడం లేదు. భారత్‌కు సంబంధించిన రాష్ట్రాలపై బంగ్లా నేత చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని తెలుస్తోందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
http://www.teluguone.com/news/content/pahalgam-effect-on-asiacup-cricket-25-197388.html





