Publish Date:Jan 28, 2022
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు మన పెద్దలు.. ఎలాంటి లక్ష్యం కోసమైనా కష్టపడి పనిచేసిన వారికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ మాటలకు అక్షరాలా సరిపోతాడు కర్ణాటకు చెందిన 77 ఏళ్ల అమయ్మహాలింగ నాయక్. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన దేశ అత్యున్నత ‘పద్మ పురస్కారాల’లోని పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు ఈ వ్యవసాయ కష్టజీవి. వ్యవసాయంలో మహాలింగ నాయక్ చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఆయనకు పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వ్యవసాయంలో మహాలింగ నాయక్ చేసిన కృషి ఏంటి? ఏం సాధించాడో తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో నెటిజన్స్ బాగా సెర్చ్ చేస్తున్నారు. బంజరు భూమిని చక్కని పంటలు పండే క్షేత్రంగా మార్చేయడమే మహాలింగ నాయక్ కృషికి నిదర్శనం.
‘సురంగ మేన్’ లేదా ‘టన్నెట్ మేన్’ అని పిలుచుకునే అమయ్ మహాలింగ నాయక్ కర్ణాటక రాష్ట్రంలోని మంగలూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేపు గ్రామంలో నివసిస్తున్నాడు. కేంద్రం తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల మహాలింగ నాయక్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 1970లలో తనకు కొండశివారులో ఉన్న భూమిని ఇచ్చిన మహాబల భట్ ను మహాలింగ నాయక్ గుర్తుచేసుకుంటున్నాడు. కొండశివారులో ఉన్న బంజరు భూమిని సుక్షేత్రంగా మార్చేందుకు మహాలింగ నాయక్ ఒంటరిగానే కృషి చేశాడు.
నీటి సదుపాయం లేని తన పొలానికి నీటి సదుపాయం కల్పించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాడు. కొండకు అవతల వైపున పారే నీటిని తన పొలంలోకి తీసుకురావాలనే భగీరథ ప్రయత్నం చేశారు. అలుపు, విరామం లేకుండా కొండను 40 ఏళ్ల పాటు కష్టపడి తవ్వి సొరంగం ఏర్పాటు చేశాడు మహాలింగ నాయక్. మహాలింగ నాయక్ తన కొండ పొలంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నాడని ఓ జాతీయ మీడియా సంస్థ కథనంలో పేర్కొనడం గమనార్హం. టన్నెల్ మేన్ మహాలింగ నాయక్ ఇప్పుడు తన పొలానికి ఎలాంటి పంపు,పైపు వాడకుండా సమృద్ధిగా నీటి సరఫరా జరిగేలా చేశాడు. తన కొండపొలంలో అనేక కొబ్బరి, అరటి చెట్లు, మిరియాల సాగుతో పాటుగా సుమారు 300 వక్క చెట్లను కూడా పెంచుతున్నాడు.
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన అమయ్ మహాలింగ నాయక్ ను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఏమి ఆ జీవితం!.. ఏమి సాధించాడబ్బా!.. కర్ణాటక సింగిల్ మేన్ ఆర్మీ!’ అంటూ ప్రశంసలతో ముంచెత్తడం విశేషం.
అమయ్ మహాలింగ నాయక్ చదువులోలేదు.. అయితేనేం.. చక్కని నైపుణ్యాలు పుణికిపుచ్చుకున్న పనివాడు. రెండు ఎకరాల బంజరుభూమిని సాగుభూమిగా మార్చేందుకు నాలుగు దశాబ్దాల పాటు ఒక్కడే కష్టపడ్డాడు. కొండలోపల లోతైన సొరంగం తవ్వాడు. తన కొండపొలం కోసం సొరంగా తవ్వడంతో సరిపెట్టకుండా ఈ గ్రేట్ టన్నెల్ మేన్ మరి కొన్ని సొరంగాలు తవ్వుతుండడం అందరికీ స్ఫూర్తిదాయకం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/padma-sri-for-tunnel-man-of-karnataka-39-130858.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.