పాద యాత్ర ..పోరు బాట

Publish Date:Dec 12, 2022

Advertisement

తెలంగాణలో ఇప్పడు రాజకీయ నాయకుల పాద యాత్రల సీజన్ నడుస్తోంది. ఓ వంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రజా సంగ్రామ యాత్ర  ఐదవ విడత పాద యాత్ర సాగుతోంది. మరో వంక వైఎస్సార్ తెలంగాణ పార్టీ, (వైఎస్సార్ టీపీ) అధినాయకురాలు వైఎస్ షర్మిల సుమారు సంవత్సర కాలానికి పైగా, అంచెల వారీగా సాగిస్తూ వస్తున్న  ప్రజాప్రస్థానం పాద యాత్రకు బ్రేక్ పడింది. వారం రోజుల క్రితం వరంగల్ లో ఆమె యాత్రను తెరాస నాయకులు అడ్డుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆమె యాత్రకు ముందుకు సాగకుండా, ఒకదానివెంట ఒకటిగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పడు ఆమె యాత్ర అనుమతి కోసం ‘దీక్ష’ చేసి ఆసుపత్రి పాలయ్యారు. ఆమె పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చినా, తెరాస సర్కార్,మాత్రం ససేమిరా అంటోంది. 

నిజానికి, బండి సంజయ్  యాత్రకు మొదట్లో పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే, కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు బండి యాత్రకు ఓకే చెప్పారు. కానీ, షర్మిల విషయంలో మాత్రం కోర్టు అనుమతించినా, పోలీసు పూజారులు నో  అంటున్నారు. అయితే, ఇంతవరకు ఎప్పుడూ షర్మిల యాత్రను అడ్డుకోని తెరాస, ఇప్పడు హటాత్తుగా షర్మిల యాత్రను అడ్డుకోవడం వెనక ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఉమ్మడి వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వ్యూహం ఏమిటో కానీ, ఇదేదో ట్రయాంగిల్  పొలిటికల్ స్టొరీలా ఉందనే  అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 

అదలా ఉంటే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి డిసెంబర్ 9 నుంచి ఆయన పాదయాత్ర మొదలవుతుందని, కొంత ప్రచారం జరిగింది. అయితే,డిసెంబర్ 7 నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో, ఆయన యాత్రను వాయిదావేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అదొక కారణమా అయితే కావచ్చును కానీ, అసలు కారణం వేరే ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో, రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకూ చేసిన పాదయాత్ర వివాదాస్పదమైన నేపధ్యంలో, ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అయితే, రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇచ్చిందని, రూట్ మ్యాప్  కూడా ఓకే అయిందని, పాటలు, ప్రచార సామగ్రి సైతం సిద్ధమైందని రేవంత్ వర్గం ప్రచారం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత, కొత్త సంవత్సరంలో రేవంత్  రెడ్డి పాదయాత్ర మొదలవుతుందని అంటున్నారు. 

అదలా ఉంటే ఇప్పటికే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేసిన, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా, నేను సైతం అంటూ పాదయాత్రకు నడుం బిగిస్తున్నారు. హైకమాండ్ అనుమతి ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. మరోవంక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొందరు, రేవంత్ రెడ్డి పాదయాత్ర లక్ష్యం పార్టీని బలోపేతం చేయడం కాదని, పాదయాత్ర ద్వారా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే పాదయాత్రకు తొందర పడుతున్నారని, సీనియర్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఒక్కరేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేతలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని సీనియరాలు కోరుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలంతా పాదయాత్ర చేయాలని ఆదేశించింది. అందులో భాగంగా, పీసీసీ, సీఎల్పీ నేతలు ఇద్దరు, కలిసి పాదయాత్ర చేయాలనే ప్రతిపాదనను అదిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ ఐక్యతను చాటే విధంగా పార్టీ కీలక నేతలంతా కలిసి బస్సు యాత్ర చేయాలన్నమరో  ప్రతిపాదన కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు చెపుతున్నారు. 

అయితే, గమ్మతుగా, రేవంత్ రెడ్డి పాద యాత్ర చేపడితే, మద్దతు ఇస్తానని, జగ్గా రెడ్డి ప్రకటించారు. మరోవంక, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాని శపధం చేసిన, కోమటి రెడ్డి వెంకట రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పొమ్మన కుండా పొగ పెట్టింది. అయన పార్టీలో ఉన్నా లేనట్లే, తాజాగా ప్రకటించిన కాంగ్రెస కమిటీలు వేటిలోనూ ఆయనకు స్థానం కల్పించలేదు. మరో వంక,మాణిక్ ఠాగూర్, రేవంత్ మీదనే కాంగ్రెస్ అధిష్టానం పూర్తి విశ్వాసం ఉంచింది. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఖాయంగా ఉంటుదని,అయితే ఆయన వెంట భట్టి ఉంటారా లేదా అన్నదే తెలవలసిల్సి ఉందని అంటున్నారు. 

అయితే ఎవరు ఏ యాత్రలు చేసినా రాష్ట్ర రాజకీయాలపై యాత్రల ప్రభావం ముపటిలా ఉండదని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పాదయాత్రల ప్రభావం పెద్దగా ఉందని, అంటున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒకటి రెండు రేజులు పాదయాత్ర చేశారు. అయినా కాంగ్రెస్ అభ్యర్ధి డిపాజిట్, కోల్పోయారు. అలాగే, పాదయాత్రలు చేసిన నాయకులు అందరూ గెలుస్తారనే భరోసా కూడా లేదని, అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.