జగన్‌కి సీనియర్... అసలు ఎవరీ ఎస్కోబార్?

Publish Date:Jul 27, 2024

Advertisement

వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ పేరు పలకడానికి కూడా తడబడిపోయాడు. ఆ పేరు పాబ్లో ఎస్కోబార్. జగన్ ఇంతకాలం చేసింది ఎస్కోబార్ తరహా పనులే. కానీ, ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టిన అయ్యగారికి ఎస్కోబార్ ఎవరో తెలియదు. ఇంతకీ ఎవరీ పాబ్లో ఎస్కోబార్? 

పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా కొలంబియాకు చెందిన మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్‌లో 80 శాతం అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా 21.9 బిలియన్ డాలర్లు వ్యక్తిగత ఆదాయంగా సంపాదించేవాడు. అతన్ని కొకైన్ రాజు అంటే, కింగ్ ఆఫ్ కొకైన్ అని అంటారు. ఎస్కోబార్ చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరొందాడు. 1990ల్లో ఏటా 30 బిలియన్ అమెరికన్ డాలర్లు సంపాదించేవాడు. తద్వారా అతను అత్యున్నత దశలో ఉన్నప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడయ్యాడు.

కొలంబియా ప్రాంతంలోని రియోనెగ్రోలో జన్మించిన ఎస్కోబార్, సమీపంలోని మెడెలిన్‌లో పెరిగాడు. యూనివర్శిడాడ్ ఆటోనామా లాటినో అమెరికనా ఆఫ్ మెడెలిన్‌లో కొద్దికాలం పాటు చదువుకున్నా, డిగ్రీ లేకుండా విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేశాడు. నేర కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించి, క్రమేపీ తప్పుడు బ్రాండ్ సిగరెట్లు, ఫేక్ లాటరీ టిక్కెట్లూ అమ్మసాగాడు. మోటారు వాహనాల దొంగతనాల్లోనూ పాల్గొన్నాడు. 1970ల్లో నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాదారుల కోసం పనిచేయడం ప్రారంభించాడు. తరచుగా జనాన్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించడమూ చేసేవాడు. ఎస్కోబార్ 1975లో యునైటెడ్ స్టేట్స్‌లో తొలి అక్రమరవాణా మార్గాన్ని ఏర్పరిచి, పౌడర్ కొకైన్ తానే అమ్మడం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో అతను వేగంగా విస్తరిస్తూ పోయాడు. ఇదే సమయంలో కొకైన్‌కు అమెరికా వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అతనికి లాభించింది. 1980ల నాటికి నెలనెలా 70 నుంచి 80 టన్నుల కొకైన్ కొలంబియా నుంచి యుఎస్‌కి రవాణా చేసేవాడని అంచనా. తన వ్యాపారంలో భాగంగా ఎస్కోబార్ హత్యాకాండకు పాల్పడేవాడు. పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయ నాయకులను హత్యలు చేసేవాడు.

1982లో ఎస్కోబార్ లిబరల్ ఆల్టర్నేటివ్ ఉద్యమం కింద కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కి ప్రత్యామ్నాయ సభ్యునిగా ఎస్కోబార్ ఎన్నికయ్యాడు. ఈ అధికారం ఉపయోగించి తన మనుషులందరికీ పశ్చిమ కొలంబియాలో ఫుట్‌బాల్ మైదానాలు, ఇళ్ళు నిర్మించి ఇచ్చాడు. దాంతో ఆ పట్టణాల స్థానికుల్లో అతనికి మంచి ప్రాచుర్యం లభించింది. ఎస్కోబార్‌కు అతని ప్రత్యర్థులకూ మధ్య జరిగిన హత్యల కారణంగా, కొలంబియా ప్రపంచ హత్యా రాజధానిగా పేరుగాంచింది, ఎస్కోబార్‌ను పట్టుకోవడానికి కొలంబియన్, అమెరికన్ ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి. 1993లో ఎస్కోబార్‌ని అతని 44వ పుట్టినరోజుకు ఒకరోజు తర్వాత స్వంత పట్టణంలో కొలంబియన్ నేషనల్ పోలీసులు కాల్చిచంపారు. ఈ ఎస్కోబార్‌కి, మన జగన్‌కీ చాలావరకు పోలికలు కనిపిస్తున్నాయి కదూ!

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.