అతి వ్యాయామం గుండెకు చేటు...

Publish Date:Mar 10, 2022

Advertisement

గుండె నొప్పిని వైద్య పరిభాషలో మాయో  కార్దియల్ ఇన్ ఫార్మన్ అంటారు. రక్త నాళాలలో ఉన్న అడ్డంకి కొన్ని సార్లు పగిలి పోయి కణాలన్నీ ఓక దానికి ఒకటి అతుక్కుని పోయి క్లాట్  అంటే రక్తం గడ్డ ఏర్పడుతుంది.దాంతో అడ్డంకి మరింత పెద్దదై రక్త నాళం పూర్తిగా మూసుకు పోతుంది. అలాంటి అప్పుడే గుండె పోటు వస్తుంది. అధిక ఒత్తిడి,ఎక్కువ వ్యాయామం చేయడం సాధారణంగా ఇందుకు కారణం గా అవుతున్నాయి. అని  అపోలో ఆసుపత్రికి చెందినప్రముఖ కార్దియలజీ డైరెక్టర్ డాక్టర్ ఎ శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేసారు. ఈమేరకు తెలుగు వన్ హెల్త్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో పేర్కొన్నారు.వ్యాయామం అతిగా చేయారాదని వ్యాయామాన్ని నె మ్మ్సదిగా మొదలు పెట్టి వేగం పెంచాలి. అదే విధంగా ఆపివేసే టప్పుడు వార్మప్ వ్యాయామాలు తప్పనిసరిఅన్నారు . ఈ సమయంలో గుండె తనపై ఒత్తిడిని సర్దుబాటు చేసుకుంటుంది ఒక్కసారి ఒత్తిడి పెడితే బేజారు అవుతారు.రీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వస్తే గుండెలో సమస్య ఉందని అర్ధం. దీని తరువాత ఎకో చేస్తారు. గుండె కొట్టుకునే టప్పుడు దానిలో డ్యామేజి అయిన ఆభాగం సరిగా కదలదు అలా డ్యామేజి ని గుర్తిస్తారు అని డాక్టర్ ఎ శ్రీనివాస్ అన్నారు.ఇ సి జి,ఎకో ట్రోపోనిన్ నార్మల్ గా ఉంటె  ఇంకా అనుమానం ఉంటె థ్రెడ్ మిల్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో ట్రేడ్ మిల్ పై నడిపిస్తూ ఇ సి జి రీడింగ్ చూస్తారు.

7౦ -8౦% బ్లాక్ ఉంటె దీనిలో తేడాలు కనిపిస్తాయి.దీనిలో పోజిటివ్ వస్తే బ్లాక్ ఎక్కడ ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోడానికి ఆంజియోగ్రామ్ చేయించాలి. సరిగ్గా ఖచ్చితమైన ఫలితం తెలియాలంటే కరోనరీ ఆంజియో గ్రామ్ పరీక్షే మేలు అని డాక్టర్ శ్రీనివాస్ సూచించారు.టి ఎం టి పరీక్షలో నెగెటివ్ వస్తే రిస్క్ ఫ్యాక్టర్ ను పరిగణలోకి తీసుకోవాలని టి ఎం టి లో నెగెటివ్ వచ్చినప్పుడు 9౦% నార్మల్ గానే ఉంటుంది. కాని బీపి,డయాబెటిస్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటె సిటి ఆంజియో గ్రామ్ చేయాల్సి వస్తుందని సిటీ అన్జియో గ్రామ్ నార్మల్ గా ఉంటె పరవాలేదని సిటీ ఆంజియో గ్రామ్ అబ్నార్మల్ గా ఉంటె సాధారణ అన్జియో గ్రామ్ చేయాల్సి వస్తుంది.అని డాక్టర్లు సూచించవచ్చని స్పష్టం చేసారు.ఆంజియో గ్రామ్ ను ఇప్పుడు డే కేర్  క్లినిక్ లోనే చేయవచ్చని అంటే పరీక్ష అయిన మూడు నాలుగు గంటలోనే ఇంటికి వెళ్లి పోవచని అన్నారు.ఇక్కడ కొన్ని అంశాలు రోగులు రోగితలూకు అటెండర్ లు కూడా తెలుసుకోవడం అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ట్రేడ్ మిల్ వరకూ అన్ని పరీక్షలలోను నార్మల్ ఉండి గుండెలో సమస్య లేదేమో అనుకున్నప్పుడు అది నిర్ధారణ చేసుకోడం కొసం సిటి ఆంజియో గ్రామ్ ఇప్పుడు చేస్తారు.కేవలం గుండెపోటు మాత్రమే కాకుండా పల్మనరీ త్రాం బో ఎంబా లిజం పి టి ఇ అయో ర్టిక్ దిసేక్షన్ అంటే మహా ధమనిలో పగుళ్ళు సమస్యలు ఉన్నా సిటి ఆంజియో గ్రామ్ లో బయట పడే అవకాశం ఉంది.

చికిత్స తో పాటుగా...

పరీక్షలు చేయించిన తరువాత జబ్బు ఉన్నట్లు తేలితే దాని తీవ్రతను బట్టి చికిత్స చేయవచ్చని.అన్నారు. జబ్బు కొంచమే ఉంటె అంటే5౦% కన్నా తక్కువ బ్లాక్స్ మాత్రమే ఉంటె స్టాటిన్స్ మందుల ద్వారా సమస్య కాకుండా నివార్రించ వచ్చని 5౦ -7౦% బ్లాక్స్ ఉంటె బార్డర్ లైన్ లో ఉన్నారని అర్ధం అని శ్రీనివాస్ వివరించారు.అలాంటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ సమస్య తీవ్రత ను అంచనా వేసి తదను గుణంగా చికిత్స్ చేయాల్సి ఉంటుందని ఒక బ్లాక్ 7౦% దాటితే తప్పనిసరిగా స్టెంట్ వేయాల్సి ఉంటుందని చికిత్స ఏదైనా దానితో పాటుగా మంచి ఆహారం తీసుకుంటూ యోగా వాకింగ్ లను జీవన శైలిలో భాగం చేసుకోవాలని .పొగ తాగడం లాంటి దురలవాట్లు కు స్వస్తి చెప్పి బిపి,షుగర్, ని నియంత్రించడం అవసరాని సూచించారు డాక్టర్ శ్రీనివాస్.

గుండె పోటు మళ్ళీ రాకుండా ఉండాలంటే...

ఇందుకోసం సెకండరీ ప్రివెన్షన్ గా కొన్ని మందులను ఇస్తారు.అడ్డంకి పెరగ కుండా స్టాటిన్ నివారిస్తుంది. కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఆస్ప్రిన్ బీటా బ్లాకర్ బ్లాకార్స్ కూడా ఇస్తారు. ఎ సి ఇ ఇంహిబిట ర్స్ కూడా ఇస్తారు.

హార్ట్ బర్న్ గుండె నొప్పి ఒకటేనా ...

కొంత మందిలో అన్నం తినగానే కొన్ని సార్లు పొట్టపై భాగం లో చాతీ లో నొప్పిగా అసౌకర్యం గా అన్పిస్తూ ఉంటుంది. అది గ్యాస్ నొప్పి గా భావిస్తారు.పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు.కొన్ని సందర్భాలాలో అది గ్యాస్ కు సంబందించినదే కావచ్చు కానీ దీని వెనుక గుండె సమాస్య కూడా ఉండచ్చు అని డాక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. అన్నం తిన్న తరువాత జరిగే శోషణ ప్రక్రియ కోసం రక్తం పొట్ట వైపు ఎక్కువగా వస్తుంది.తద్వారా గుండెకు రక్త సరఫరా తగ్గి అసౌకర్యం ఏర్పడుతుందని డాక్టర్ శ్రీనివాస్ విశ్లేషించారు. ఈ రకమైన చాతీ నొప్పి ని పోస్ట్ ప్రాండియాల్ ఎంజైనా అని అంటారు.చాలా సందర్భాలలో దానిని గ్యాస్ నొప్పిగా ఏసీ డిటి పొరబడతారు.కాని కడుపు ఉబ్బరం గా కాకుండా ఛాతీలో అసౌకర్యం కలుగు తుంది అంటే అనుమానించాల్సిందే . ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలని పోస్ట్ ప్రాండియాల్ ఎంజైనా ఉన్నప్పుడు సా ర్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెడితే రిలీఫ్ వస్తుందని సూచించారు.ఇది ఒక రకంగా గుండె పోటుకు హెచ్చరిక లాంటిది గా భావించాలి రెండూ మూడు అయ్యిందంటే అది తీవ్రమై గుండె పోటుకు దారి తీస్తుందని .ఇలాంటి సమయం లో విశ్రాంతి గా కూర్చుని ఉన్న గుండేనొప్పి వస్తుంది.

అందుకే నిర్లక్షం చేయవద్దని అపోలో ఆసుపత్రికి చెందిన హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. ఆతి వ్యాయామం గుండె కు చేటు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్ హెచ్చరిక.               
 

By
en-us Political News

  
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.