మనిషిలో మరొక అంతర కోణం!

Publish Date:May 20, 2026

Advertisement

హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు.

పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ.

మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది.

మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.

 పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన.

కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు.

కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం

                                   ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు...
సినిమాలు, సోషల్ మీడియా , సొసైటీ  తరచుగా వివాహాన్ని ఒక అందమైన చిత్రంగా చూపిస్తాయి. కానీ వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది..
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.