ఎముకలను చెదపురుగుల్లా తినేసే ఈ వ్యాధి గురించి తెలుసా?
Publish Date:Jun 18, 2025
.webp)
Advertisement
ఎముకలు శరీరానికి ఊతాన్ని ఇస్తాయి. ఎముకలు ఎంత బలంగా ఉంటే శరీరం అంత బలంగా ఉంటుందని అర్థం. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఎముకల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎముకలకు సంబంధించి చాలా వ్యాధులు కూడా ఉన్నాయి. వాటిలో ఒక వ్యాధి ఎముకలను చెదపురుల్లా తినేస్తుంది. ఇంతకీ ఆ వ్యాధి ఏమిటో.. దాన్నుండి బయటపడే మార్గం ఏమిటో.. ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో.. వివరంగా తెలుసుకుంటే..
ఎముకలు క్రమంగా బలహీనపడతాయని చాలామందికి తెలియదు. అది కూడా స్పష్టమైన లక్షణాలు లేకుండానే బలహీన పడతాయి. దీనికి కారణం అయ్యే వ్యాధిని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ వ్యాధి ఎముకల బలాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ లక్షణాలు గుర్తించే సమయానికి, ఎముకలు చాలా బలహీనంగా మారతాయి. చిన్న చిన్న దెబ్బలు కూడా ఎముకల పగుళ్లకు కారణం అవుతాయి. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి? దానిని ఎలా నివారించాలంటే..
ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు క్రమంగా సన్నగా, బలహీనంగా మారే వ్యాధి. అవి లోపల నుండి బోలుగా మారుతాయి. చెదపురుగులు చెక్కను ఆక్రమించినట్లు. బయట నుండి ప్రతిదీ బాగానే కనిపిస్తుంది, కానీ లోపల ఎముకలు బలహీనమవుతాయి.
మహిళలు, ముఖ్యంగా మెనోపాజ్ దశకు చేరుకున్న వారు, 50 ఏళ్లు పైబడిన వారు తక్కువ కాల్షియం, విటమిన్ డి ఆహారం తీసుకునేవారు ఎక్కువసేపు నిశ్చలంగా ఉండేవారు, వ్యాయామం చేయనివారు అధికంగా ధూమపానం చేసేవారు లేదా మద్యం సేవించేవారు ఎక్కువ కాలం కొన్ని మందులు తీసుకునేవారు.. ఇలా వీరందికి ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధి ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
లక్షణాలు..
ఆస్టియోపోరోసిస్ యొక్క అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడమే. ప్రజలు అంతా బాగానే ఉందని అనుకుంటారు కానీ లోపల ఎముకలు బలహీనపడుతుంటాయి. కొన్ని సాధారణ లక్షణాలు కూడా ఉంటాయి. వాటిలో నిరంతరం వెన్నునొప్పి,
నడుము వంగడం ప్రారంభమవుతుంది. అలాగే ఎత్తు తక్కువగా మారుతుంద. చిన్న గాయంలో కూడా చేయి లేదా కాలు ఎముకలు విరిగిపోతాయి.
వ్యాధి నిర్థారణ..
ఈ వ్యాధిని BMD (బోన్ మినరల్ డెన్సిటీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు. దీనిని DEXA స్కాన్ అని కూడా అంటారు. ఈ స్కాన్ ఎముకలు ఎంత బలంగా ఉన్నాయో చూపిస్తుంది.
నివారణ ఎలాగంటే..
మంచి ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, జున్ను, ఆకుపచ్చ కూరగాయలు, బాదం తీసుకోవాలి. అలాగే వీలైనంత సూర్యకాంతి నుండి విటమిన్ డి లభించేలా జాగ్రత్తలు పాటించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ నడవాలి. తేలికపాటి యోగా చేయాలి. మెట్లు ఎక్కాలి. ఇది ఎముకలను బలపరుస్తుంది .
చెడు అలవాట్లను నివారించాలి. సిగరెట్లు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఎముకలను త్వరగా బలహీనపరుస్తాయి.
వైద్యులు ఏమంటున్నారంటే..
ఆస్టియోపోరోసిస్ త్వరగా వచ్చే వ్యాధి కాదు. నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. కానీ అది దాని ప్రభావాన్ని చూపించే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుండే ఎముకలను జాగ్రత్తగా చూసుకోవాలి. రోగం వచ్చాక వైద్యం చేయించుకోవడం కంటే రోగం రాకుండా జాగ్రత్త పడటం మంచిది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/osteoporosis-symptoms-and-causes-34-200200.html












