ఓఆర్ఆర్ టెండర్ గోల్ మాల్.. కేసీఆర్ సర్కార్ పై మరో మరక

Publish Date:May 5, 2023

Advertisement

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం .. టీఎస్పీఎస్సీ పేపర్ లేకేజి కుంభ కోణం.. ఇప్పుడు ..తాజాగా ఓఆర్ఆర్ కుంభకోణం. తెలంగాణలో జరిగిన కుంభకోణాలు ఇంకా ఉన్నా..ఈ మూడు కుంభకోణాల్లో ..ఒక కామన్ త్రెడ్’ కనిపిస్తుంది. అవును ఈ మూడు మేజర్ కుంభకోణాల్లో ముఖ్యమంత్రి .. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆఫ్కోర్స్  మిషన్ కాకతీయ, మిషన్ సిసన్ భగీరధ, మొదలు, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్ వంటి ప్రాజెక్టులు, పథకాలలో అవినీతికి సంబందించి వచ్చిన ఆరోపణలు అన్నిటిలో ముఖ్యమంత్రి కుతుమాబ్ సభ్యుల పేర్లు ప్రముఖంగా వినిపించిన మాట నిజమే అయినా ఈడీ, సీబీఐ ఎంట్రీతో ఈ కేమూడు కేసులు రాజకీయంగానూ ప్రధాన్యత సంతరించుకున్నాయి.

నిజమే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం పెద్ద విశేషం కాదు. ఇంచు మించుగా 25 సంవత్సరాలకు కొంచెం అటూ ఇటుగా  ముఖ్యమంత్రి, ప్రధాని వంటి కీలక పదవుల్లో ఉన్నా, కుటుంబ సభ్యులు ఎవరినీ, అధికారం గడప దాక కూడా రానీయని  ప్రధాని మోడీ పైనే ఆరోపణలు వచ్చినప్పడు, పీవీ, మన్మోహన్ వంటి పెద్ద మనుషులకే అవినీతి మరకలు తప్ప నప్పుడు ... తెలంగాణలో ఏకంగా ఐదారుగురు కుటుంబ సభ్యులు అధికార పదవులు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు ఫ్యామిలీ పై ఆరోపణలు రావడం విశేషం కాదు. అలాగే దళిత బంధు పథకం లబ్దిదారుల నుంచి మూడేసి లక్షలు (30 శాతం) లంచాలు పుచ్చుకున్న ఎమ్మెల్యేల చిట్టా చేతిలో  పెట్టుకుని కూడా ... చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి కేసీఅర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటారు అనుకోవడం కుదిరే వ్యవహారం కాదు. 

నిజమే కావచ్చును తన  కొడుకు , కూతురు సహా ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రే స్వయంగా శాసన సభలో ప్రకటించి ఉండవచ్చును  కానీ  దళిత ముఖ్యమంత్రి హామీ లాగా అది జరగలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు. 

అయితే ఇప్పడు  ఓఅర్ఆర్ విషయంలో తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్లు. ఈ వ్యవహారంలో అటు నుంచి బీజేపీ ఇటు నుంచి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు చేస్తున్న సవాళ్ళు సర్కార్ ను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. అంతే కాదు  మళ్ళీ ఈ గోల్ మాల్ వ్యవహారంలోనూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు కేటీఆర్, కవితపై  రోపణలు చేయడమే కాకుండా  ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోరుతున్నారు. రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు.  ఇందుకు సంబంధించి తాజగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను 30 సంవత్సరాల పాటు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం సరైన పద్ధతి కాదని  అన్నారు.  ప్రైవేటు కంపెనీకి లీజు ఇచ్చే విషయంపై కోర్టుకు వెళ్తామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా లేఖ రాస్తామని స్పష్టం చేశారు. 

మరో వంక రాష్ట్రప్రభుత్వం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి స్పందిచక పోవడం, అదే సమయంలో దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వారిని హెచ్చరించిన నేపధ్యంలో  ప్రభుత్వం ఇంకా పలచనవుతోందని, అవినీతి ముద్ర ముఖ్య్మగా కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి ప్రధాన ఎన్నికల అంశం మారే అవకాశం ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.