విపక్షాలను ఏకం చేసిన రాహుల్ అనర్హత వివాదం

Publish Date:Apr 3, 2023

Advertisement

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేజేతులా జాతీయ స్థాయిలో హస్తం పార్టీకి అండ దొరికేలా చేస్తోందా? బీజేపీ, కాంగ్రెస్ లకు సమాన దూరం పాటించలని భావిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ కు మద్దతుగా రోడ్లపైకి వచ్చేలా చేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ పడికట్టు మాటలు మాట్లాడుతూ.. అన్యాపదేశంగా తమ వ్యతిరేకుల విషయంలో మాత్రమే చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ, అస్మదీయుల విషయంలో కాదనీ విపక్షాలు భావించేలా బీజేపీ తీరు ఉందనీ అంటున్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశంలో బీజేపీ యేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చింది. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం అంటూ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే బీజేపీని ఎంతగా వ్యతిరేకిస్తారో, అంతగా కాంగ్రెస్ నూ వ్యతిరేకించే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ..ఇలా దేశంలో ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా జట్టు కట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అనర్హత రగడలో రాహుల్‌కు దాదాపుగా ప్రతిపక్షా లన్నీ అండగా నిలబడ్డాయి.జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రాల స్థాయిలో కూడా రాహుల్ కు మద్దతు పెరుగుతోంది.  ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ వినా, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలన్నీ రాహుల్ కు అండ, మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అయితే ఒక అడుగు ముందుకు వేసి.. విద్యార్హతలను బయటపెడదాం అనే ఉద్యమానికి పిలుపు నిచ్చింది.

 నిన్న మొన్నటి వరకూ బీజేపీయేతర పక్షాలుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించిన ఆ పార్టీలన్నీ ఇప్పుడు రాహుల్ గాంధీ అనర్హత వేటుకు నిరసనగా ఏకతాటిపైకి వచ్చాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పిలుపు మేరకు గత నెల 27న జరిగిన నిరసన ప్రదర్శనల్లో   17 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. జాతీయ రాజకీయా ల్లో కాంగ్రెస్‌ కు దూరంగా ఉండే  తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నది.   దేశంలో  రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మొగిలిన పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ దూకుడుగా ఉంటుంది.  

అయితే ఒక్క లక్షద్వీప్‌కు చెందిన మహమ్మద్‌ ఫైజల్‌ మినహా ఎవరిపైనా ఇటీవలి కాలంలో అనర్హత వేటు పడలేదు. తాజాగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో సామాన్య ప్రజల్లో రాహుల్‌పై సానుభూతి పెరి గింది. రాహుల్‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ టార్గెట్‌ చేసిందన్న అభిప్రాయం జనబాహుల్యంలో కలిగింది. దీనిని గుర్తించే సైద్ధాంతికంగా కాంగ్రెస్‌తో విభేదించే రాజకీయ పార్టీలు సైతం  రాహుల్‌కు అండగా నిలుస్తున్నాయి. మరో ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అనర్హత వివాదమే కీలకాంశం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.