విపక్షంలో ఏ పార్టీ ఉన్నా వారి టార్గెట్‌ పోలీసులే!

Publish Date:Mar 17, 2020

Advertisement

తమ రాజకీయాలకు పోలీసులను బలిపీఠమెక్కిస్తున్న విషాదకర పరిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెలకొంది. ప్ర‌స్తుతం చంద్రబాబు నాయుడు కూడా జగన్ దారిలోనే నడుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విపక్షాలకు చెందిన అభ్యర్ధులపై పోలీసుల ప్రోత్సాహంతోనే, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, కేంద్రబలగాలను పంపి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో పోలీసులు అన్‌ఫిట్. వారు భయపడుతున్నారు. అందుకే కేంద్రబలగాలతో ఎన్నికలు నిర్వహించాలని’ బాబు వ్యాఖ్యానించారు. అదేవిధంగా, బాబును పోలీసులు ఆయన నివాసం వద్దనే నిలిపివేసిన వైనంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భద్రత తగ్గించిన వైనంపైనా ఆయన జగన్ ప్ర‌భుత్వం పై విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

గతంలో ప్ర‌తిపక్షంలో ఉన్న వైసీపీ ఫిర్యాదు మేరకు, ఐపిఎస్‌లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయగా.. ఇప్పుడు విపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ ఫిర్యాదు మేరకు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఐపిఎస్, డీస్పీ, సీఐలపై కొరడా ఝళిపించింది. అంటే విపక్షంలో ఏ పార్టీ ఉన్నా, వారికి పోలీసులే టార్గెట్. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులపై నమ్మకం లేదని విమర్శించిన వారే, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసులకు కితాబు ఇవ్వడం ఏపీ రాజ‌కీయా నాయ‌కుల్లోనే క‌నిపిస్తుంది.

 

 

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, చంద్ర‌బాబునాయుడు ఇద్దరు నేతలు.. తమకు అధికారం లేనప్పుడల్లా, పోలీసు వ్యవస్థను అప్రతిష్ఠ పాలు చేయడం పోలీసులకు మనస్తాపానికి గురిచేస్తోంది. ప్రాణాలు పణంగా పెట్టి, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తు, కుటుంబ జీవితాలను కూడా త్యాగం చేసి, పిల్లలను కూడా పట్టించుకోకుండా రోడ్డుపైనే జీవితం గడుపుతున్న తమను.. రాజకీయ పార్టీలు ప్రజల దృష్టిలో, ముద్దాయిలుగా మార్చడాన్ని పోలీసులు భరించలే కపోతున్నారు.

రాజకీయ పార్టీలు, తమ స్వార్ధం కోసం పోలీసు వ్యవస్థపై బురద చల్లడం వల్ల.. పోలీసులు నైతిక సైర్థ్యం కోల్పోతే నష్టపోయేది, పౌర సమాజమేనని వారంటున్నారు. తాము లేకుండా, అడుగు కూడా ముందుకు వేయలేని రాజకీయ నాయకులు, వారి స్వార్థం కోసం తమనే అవమానించడం అనైతికమంటున్నారు. గతంలో చంద్రబాబు, జగన్ విపక్ష నేతలుగా ఉన్నప్పుడు నిర్వహించిన పాదయాత్రలకు.. ఎండనక, వాననక వారికి భద్రత కల్పించింది తామేనన్న విషయాన్ని మర్చిపోయి పోలీసుల్ని విమ‌ర్శించ‌డం దారుణ‌మంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా వైఎస్. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నా, చంద్రబాబు ఉన్నా పోలీసు వ్యవస్థపై మ‌చ్చ ప‌డ‌లేదు. తమ వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని దళిత, బీసీ సంఘాల నేతలు మాత్రమే అప్పట్లో విమర్శలు కురిపించేవి. జిల్లాల్లో ఉన్న కులసమీకరణ ఆధారంగా పోస్టింగులు ఇచ్చే సంప్రదాయం అప్ప‌ట్లో ఉండేది.

 

ఉదాహరణకు కమ్మ ఆధిపత్యం, రెడ్ల హవా ఎక్కువగా ఉండే గుంటూరు జిల్లాలో ఆ రెండు వర్గాలకు చెందిన వారు కాకుండా, ఇతర కులాలకు చెందిన అధికారులను ఎస్పీ, కలెక్టర్లుగా నియమించేవారు. డీఎస్పీ, సీఐల నియామకాలు కూడా అలాగే ఉండేవి. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇలాంటి పద్ధతి పాటించేవి. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కులాలకే ప్రాధాన్యం మొదలయింది.

సమర్ధత, నిజాయితీ ప్రాతిపదిక కాకుండా.. కులం-విధేయతకే పట్టం కట్టే సంప్రదాయం ప్రారంభమయింది. దానితో అసలు ఎలాంటి పలుకుబడి, ప్రభావం లేని కింది స్థాయి కులాలకు చెందిన పోలీసులకు, అప్రాధాన్య పోస్టులు దక్కేవి.

టీడీపీ హయాంలో రెడ్డి, ఎస్సీ, కులాలకు చెందిన వారికి, చాలాకాలం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడం విమర్శలకు దారితీసింది. వారంతా వైసీపీకి మానసిక మద్దతుదారులయినందున, వారికి కీలకమైన పోస్టింగులు ఇస్తే ఆ పార్టీకి సహకరిస్తారన్న అనుమానమే, దానికి కారణమన్న విశ్లేషణ అప్పట్లో వినిపించింది. డీఎస్పీ పోస్టింగులు, ఎస్పీలలో ఎంతమంది కమ్మవర్గానికి చెందిన వారికి ఇచ్చారో ఒక జాబితాను విడుదల చేశారు.

అమ‌రావ‌తి రాజ‌ధానిగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పోలీసులపై న ఆరోప‌ణ‌లు పెరిగాయి. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు కొంత మంది పోలీసులు కులం, పక్షపాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఫలానా పోస్టులో ఫలానా కులం వారిని నియమించారన్న నాటి వైసీపీ ఆరోపణలు, పోలీసులను నైతికంగా దెబ్బతీశాయి.

 

 

ప్ర‌స్తుతం జగన్ సర్కారు, కమ్మ వర్గానికి చెందిన పోలీసు అధికారులను వెయిటింగ్‌లో ఉంచి, ప్రతీకారం తీర్చుకుంది. మరికొందరికి లూప్‌లైన్ పోస్టింగులు ఇచ్చింది. ఐపిఎస్, ఐఏఎస్‌లకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకపోగా, కొందరిని సస్పెండ్ చేసింది. కాపు వర్గానికి చెందిన పోలీసుల విషయంలోనూ ఇదే విధానం అవలంబిస్తోంది. రెడ్డి, బీసీ, ఎస్సీ, ముస్లిం వర్గానికి చెందిన వారికి మంచి పోస్టింగులు ఇవ్వడం ద్వారా, వారిని మెప్పించింది. బాబు జమానాలో లూప్‌లైన్‌లో ఉన్న వారికి, ఎక్కడా లంచాలు తీసుకోకుండానే జగన్ సర్కారు ప్రాధాన్యం ఇచ్చింది. అసలు తమకు అలాంటి పోస్టింగులు వస్తాయని, సదరు అధికారులు కూడా ఊహించనంతగా, జగన్ సర్కారు వారిని అందలమెక్కించింది.

ప్ర‌తిప‌క్ష నేత నుంచి ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన తర్వాత జగన్ మోహ‌న్‌రెడ్డి అనేక సందర్భాల్లో పోలీసుల పనితీరును ప్రశంసించడం విశేషం. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, పోలీసుల పనితీరును ఆయన ఆకాశానికెత్తారు. పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. ఎస్పీ, డీఎస్పీ, సీఐలను బదిలీ చేయడంపై జగన్ స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.