ల‌ష్క‌రే నేత‌ సైఫుల్లా ఖ‌లీద్ హ‌తం..మ‌రో ఎల్ఈటీ లీడ‌ర్ అమీర్ హంజాకి గాయం

Publish Date:May 22, 2025

Advertisement

వీటి వెన‌క తాలిబ‌న్ల హ‌స్త‌ముందా?
సీఐఏ మాజీ ఏజెంట్ సారా ఆడ‌మ్స్
మాట‌ల‌ను బ‌ట్టీ మ‌న‌కేం తెలుస్తోంది?

ఏడాది కిందట   సీఐఏ మాజీ ఏజంట్ సారా ఆడ‌మ్స్ ఒక  ఒక టాక్ షోలో . పాకిస్థాన్ లోని టెర్ర‌రిస్టులే టార్గెట్ గా భార‌త్ ఒక ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌బోతోంది. ఈ ఆప‌రేష‌న్ కి తాలిబ‌న్ల‌ను వినియోగించ‌నుంద‌ని అన్నారు. ఆర్ యూ సీరియ‌స్? అంటూ ఆ ఇంట‌ర్వ్యూయ‌ర్ ఆమెను అడ‌గ‌టం. ఆమె అవును నిజ‌మ‌ని చెప్ప‌డం జ‌రిగింది. అక్క‌డ క‌ట్ చేస్తే.. మొన్న సింధ్ ప్రావిన్స్ లోని మ‌ట్లీ ప‌ట్ట‌ణంలో త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కొచ్చిన సైఫుల్లా ఖ‌లీద్ అనే ల‌ష్క‌రే తోయిబాకు చెందిన అగ్ర‌నాయ‌కుడ్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌ల, గుండెల‌పై కాల్చి ప‌రార‌య్యారు. దీంతో ఖ‌లీద్ స్పాట్ డెడ్ అయ్యాడు.

ఎవ‌రీ ఖ‌లీద్ అని చూస్తే 2000లో నేపాల్ మాడ్యుల్ హెడ్, 2005 బెంగ‌ళూరు అటాక్, 2006 నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్ట‌ర్స్ పై దాడి,  2008 యూపీ  రాంపూర్ ఇలా వ‌రుసగా జరిగిన ల‌ష్క‌రే ఆప‌రేష‌న్స్ క‌మాండ‌ర్. తాజాగా అత‌డు సింధ్ ప్రాంతంలోని ల‌ష్క‌రే ఆప‌రేష‌న్స్ కి హెడ్ గా హ‌ఫీజ్ స‌యీద్ ద్వారా నియ‌మితుడయ్యాడు. అత‌డీ ఆప‌రేష‌న్స్ లో ఉండ‌గా.. కాల్పులు జ‌ర‌గ‌టం, అత‌డు ఖ‌తం కావ‌డం చ‌క‌చ‌క  జ‌రిగిపోయాయి.

తాజాగా అమీర్ హంజా అనే మ‌రో ల‌ష్క‌రే వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడి ఇంట్లో కాల్పులు జ‌ర‌గ్గా.. అత‌డికి గాయాల‌య్యాయి. దీంతో లాహోర్ ఆస్ప‌త్రిలో చేరాడు అమీర్ హంజా. ఇత‌డిది ఎలాంటి పాత్ర అంటే ల‌ష్క‌రే వ్య‌వ‌స్థాప‌క స‌భ్యులు 17 మంది ఉండ‌గా.. వారిలో చీఫ్ హ‌ఫీజ్ కి అత్యంత స‌న్నిహితుల్లోని ఒక‌రిద్ద‌రిలో ఇత‌డు కూడా ఒక‌డు. ఇత‌డు ఉద్వేగ‌భ‌రిత ప్ర‌సంగాల‌కు..  ఉత్తేజ‌పూరిత‌మైన ర‌చ‌న‌ల‌కు పెట్టింది పేరు. మ‌త‌మార్పిడిపై ఇత‌డు రాసిన  పుస్తకం ఒక‌ సంచ‌ల‌నం. ఐక్య‌రాజ్య స‌మితి గుర్తించిన అంత‌ర్జాతీయ ఉద్ర‌వాదుల్లో ఇత‌డు కూడా ఒక‌డు. అలాంటి వ్య‌క్తి రేపు మ‌ర‌ణిస్తే హ‌ఫీజ్ స‌యీద్ కి మ‌రింత పెద్ద ఎత్తున దెబ్బ త‌గ‌ల‌నుంది.

ఇప్ప‌టికే మొన్న‌టి ఆప‌రేష‌న‌న్ సిందూర్ ద్వారా ముజ‌ఫ‌రాబాద్ లో ల‌ష్క‌రే శిబిరం ధ్వంస‌మైంది. ఇందులో హ‌ఫీజ్ స‌యీద్ కొడుకు త‌ల్హా స‌యీద్ అత‌డి ఐదుగురు క‌మాండ‌ర్లు హ‌త‌మయిన‌ట్టు వార్త‌లొచ్చాయ్. వీరితో పాటు మ‌రో ఐదుగురు ఉగ్ర‌వాదులు హతమయ్యారన్న రిపోర్టులొచ్చాయి. వీరిలో ముగ్గురు ల‌ష్క‌రే నాయ‌కులున్నారు. ఒక ద‌శ‌లో హ‌ఫీజ్ స‌యీద్ సైతం చ‌నిపోయాడ‌న్న క‌థ‌నాలు వెలువ‌డ్డాయ్. అయితే ఈ దిశ‌గా అధికారిక ప్ర‌క‌ట‌న‌లేవీ లేవు. మొత్తంగా ల‌ష్క‌రేకి ఆప‌రేష‌న్ సిందూర్ తోనే పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగింది.  తాజాగా కాల్పుల ఘ‌ట‌న‌లో ఖ‌లీద్ చ‌నిపోవ‌డం, అమీర్ హంజా ఆస్ప‌త్రిపాలుకావ‌డంతో.. ఆప‌రేష‌న్ ఎల్ఈటీ ఏదైనా న‌డుస్తోందా? అంటే అందుకు సారా ఆడమ్స్ ఏడాది కిందట చేసిన వ్యాఖ్యల  పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఔనని చెప్పక తప్పదు. 

భార‌త్, ఆఫ్గ‌న్ మ‌ధ్య ఇటీవ‌లి కాలంలో సంబంధాలు బాగా మెరుగ‌య్యాయి. గ‌త ఏడాదికాలంగా ఖైబ‌ర్ పంక్తుక్వా స‌రిహ‌ద్దు ప్రాంత విష‌యంలో పాకిస్తాన్- ఆఫ్గ‌నిస్తాన్ దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క‌ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. దానికి తోడు భారీ ఎత్తున ఆఫ్గ‌న్ శ‌ర‌ణార్దుల‌ను పాకిస్థాన్ ఇర‌కాటంలో పెట్టింది. దీంతో ఆఫ్గ‌నిస్థాన్ లోని తాలిబాన్ ప్ర‌భుత్వం పాకిస్థాన్ అంటేనే మండిప‌డుతోంది. గ‌తంలో తాలిబాన్లు ఆఫ్గ‌నిస్తాన్ ని ఆక్ర‌మించుకున్న‌పుడు పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ తో స‌హా.. చాలా మంది కాబూల్ చేరి.. అక్క‌డ సంబ‌రాలు చేసుకున్నారు. ఆనాటి వాతావ‌ర‌ణం ప్ర‌స్తుతం ఈ రెండు దేశాల మ‌ధ్య ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. 

ఇక్క‌డ మోడీ ఒక ప‌క్క ప‌హెల్గాం దాడి ప్రతీకారం తీర్చుకునే దిశ‌గా సైన్యానికి ఇవ్వాల్సిన స్వేచ్ఛ‌నిస్తూనే మ‌రొక ప‌క్క ఆఫ్గాన్ త‌లుపు త‌ట్టారు. మోడీ నుంచి పెద్ద ఎత్తున దాడి జ‌ర‌గ‌టం ఖాయ‌మ‌ని భావించిన పాక్ త‌న ఉగ్ర‌వాదుల‌ను బంక‌ర్ల‌లోకి  పంప‌డం, త‌న ద‌ళాల‌ను స‌రిహ‌ద్దుల‌కు త‌ర‌లించ‌డంలో బిజీగా ఉంటే మ‌న భార‌త ప్ర‌తినిథి తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాకిని క‌లిశారు. ఈ దిశ‌గా మాకు మీ స‌హాయ స‌హ‌కారాలు కావాల‌ని కోరారు. 

అప్ప‌టికే ఆఫ్గ‌నిస్థాన్ ప్రభుత్వ ప్ర‌తినిథి ప‌హల్గాం దాడిని ఖండించారు.  బాధిత కుటుంబాలకు మా సానుభూతి ప్రకటించారు.  ఈ క్ర‌మంలో భార‌త్- ఆఫ్గాన్ సంబంధాలు మెరుగుప‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో పాక్- ఆఫ్గ‌న్ సంబంధ బాంధ‌వ్యాలు క్షీణిస్తున్నాయి. ఇటు భార‌త్ తో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న తాలిబాన్లు.. అటు బ‌లూచిస్తాన్ లిబ‌రేష్ ఆర్మీకి కూడా త‌మ స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తూ పాకిస్థాన్ని తీవ్ర ఇర‌కాటంలో పెడుతున్నారు. పాకిస్థాన్- చైనాతో చెలిమి చేస్తుంటే భార‌త్- ఆఫ్గ‌న్ తో స్నేహానికి సై అంటోంది. దీని ద్వారా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోన ఉగ్ర‌వాదుల పీచ‌మ‌ణ‌చ‌డానికి స‌రికొత్త ఆప‌రేష‌న్ కి తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది. ఆప‌రేషన్ సిందూర్ ఆగ‌దు అంటే ఇదే మ‌రి అంటున్నారు పరిశీలకులు.   తాలిబాన్ల సాయంతో  ఆపరేషన్ సిందూర్ నిరంత‌రాయంగా కొనసాగుతుందనీ, ఉగ్ర‌వాదుల ఊచ‌కోత చేస్తూనే వెళ్తుంద‌ని.. సీఐఏ స్థాయి వ్య‌క్తులు అన్న మాట‌ల‌కు అస‌లైన అర్ధం నిర్వ‌చ‌నం ఇదేనంటున్నారు దౌత్య వ్య‌వ‌హారాల  నిపుణులు.

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.