జగన్ పాలన అంతానికి బీజం వేసిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కి ఏడాది!

Publish Date:Oct 29, 2024

Advertisement

నారా చంద్రబాబునాయుడిని జగన్ సర్కార్ కుట్రతో  స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసింది.  ఆ సందర్భంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహం మహామహా తలపండిన నేతలనే ఆశ్చర్యానికి గురి చేసింది.  రాజకీయాలతో సంబంధం లేకుండా జనం వెల్లువలా బయటకు వచ్చి ఆందోళనలకు దిగారు. కులం, మతం, రాజకీయం, రాష్ట్రం, దేశం ఇలా ఎలాంటి తేడాలూ లేకుండా ప్రపంచం నలుమూలల చంద్రబాబు అరెస్టునకు నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనలకు, నిరసనలకూ ఎవరూ పిలుపు ఇవ్వలేదు. ఎవరికి వారుగా స్వచ్ఛందంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి రోడ్లపైకి వచ్చారు. నిర్బంధాలను లెక్క చేయలేదు. ఎవరాపగలరు మా ఆగ్రహాన్ని. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. అరెస్టులతో చంద్రుడి వెలుగులను దాచలేరు అంటూ జనం నినదించారు. ఒక నేతను అరెస్టు చేస్తే ఇంత జనాగ్రహమా? ఏమిటి ఆయన గొప్పతనం? ఎందుకింత ప్రజాభిమానం.  , ఆయనేమీ దేవుడు కాదే. ఇంద్రుడూ కాదు , చంద్రుడూ కాదు. ఎందరో నాయకుల్లో ఆయనొకరు, కానీ, ఆయన కోసం ప్రపంచంలో  తెలుగువారు ఉన్న ప్రతి దేశంలో ఆందోళనలు జరిగాయి. ఆయనను విడుదల చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. 

అవన్నీ ఒకెత్తైతే గచ్చిబౌలిలో  నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ మరో ఎత్తు. ఆ సభ ఒక అద్భుతం. ఎవరెవరో, ఎక్కడెక్కడ నుంచో   వచ్చి చంద్రబాబు కోసం గళం విప్పారు.  దేశ విదేశాల నుంచి   విభిన్న వర్గాల ప్రముఖులు, సామాన్యులు ఒక్కటిగా మారి చంద్రబాబు గోప్పతనాన్ని వివరించారు. ఆయన అరెస్టు అక్రమమని నినదించారు. చరిత్రలో న భూతో  న భవిష్యతి అన్నట్లుగా జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కు నేటికి ( 29 అక్టోబర్ 2025) సరిగ్గా ఏడాది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ ఐదేళ్లు అరాచక పాలన సాగించారు. మంచి, చెడ్డా, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా ప్రత్యర్థులను వేధించడమే పాలన అన్నట్లుగా ఆయన హయాంలో అరాచకం తాండవమాడింది.  అందులో భాగంగానే రాజకీయ కక్షతో  జగన్   చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో నిర్బంధించారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి ముందు వరకూ జగన్ సర్కార్ పై ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత ఆగ్రహం ఉన్నా.. నిర్బంధం, పాశవిక దాడులకు భయపడి జనం ఆగ్రహాన్ని అణిచిపెట్టుకుని ఉన్నారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తూ గడిపారు. కానీ ఎప్పుడైతే  జగన్ అక్రమంగా చంద్రబాబును జైలుకు పంపారో అప్పుడిక జనం భయాన్ని వదిలేశారు. జగన్ దుర్మార్గంపై తిరగబడ్డారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలను చేశారు. ఆసమయంలోనే చంద్రబాబుకు సంఘీభావంగా   దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చి గచ్చిబౌలిలో  చంద్రబాబు గ్రాటిట్యూడ్ కన్సర్ట్ నిర్వహించారు. 

సాధారణంగా ఎవరైనా అరెస్టైతే ఆయన చేసిన అక్రమాల గురించి ప్రజలు చర్చించుకుంటారు. ఆయన అన్యాయాలపై మాట్లాడుకుంటారు. కానీ చంద్రబాబు అరెస్టైన తరువాత ప్రజలలో ఆయన గొప్పతనం గురించి చర్చ జరిగింది. ఆయన సాధించిన ఘనతల గురించి జనం మాట్లాడుకున్నారు. ఇక సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ అయితే  చంద్రబాబు నాయుడు గొప్ప తనాన్ని మరో మారు   ప్రపంచం కళ్లకు కట్టింది.

 అవును  హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో  సరిగ్గా ఏడాది కిందట జరిగిన ఆ సభ చంద్రబాబు నాయుడు దార్శనికతకు దర్పణంగా నిలిచింది. ఎప్పుడో, పాతికేళ్ళ నాడు కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు  నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై నిలిచిన దృశ్యం ఆవిష్కృతమైంది. చంద్రన్నకు ఐటీ వందనం చేసింది. తెలుగు యువత హైటెక్  భవితకు బంగరు బాటలు పరిచిన  విజనరీకి వందనం చేసింది. వందనం చేయటమే కాదు. గళం విప్పి గర్జించింది.  ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో, అత్యధికులు యువకులు.  చంద్రబాబు విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామనీ, అందుకే ఆయనకు కృతజ్ణతలు తెలపుకోవడంతో పాటు ఆయన అక్రమ అరెస్టును ఖండించి ఆయను సంఘీభావంగా నిలబడేందుకే వచ్చామని ఎలుగెత్తి చాటారు.  వేలాది ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబుకు జై కోట్టారు.. సీబీఎన్ జిందాబాద్.. మేము సైతం బాబు కోసం లాంటి స్లోగన్లు చేశారు.

 హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ను నిర్మించి పాతికేళ్లు అయిన సందర్భంగా.. ఐటీ రంగానికి బీజం వేసిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమలో  పలువురు మాట్లాడిన మాటలు.. చేసిన ప్రసంగాలు చంద్రబాబు గొప్పతనం మరోమారు కళ్ల ముందు సాక్షాత్కారమయ్యేలా చేశాయి.   

ఆయన ముందు చూపుతో నాటిన విత్తు ఈరోజు ఏ విధంగా మహా  వృక్షమై, తమవంటి లక్షల మందికి  ఎలా నీడను అందిస్తున్నదో, దేశ  విదేశాల్లో తాము సాధించిన విజయాలకు చంద్రబాబు నాయుడు ఏవిధంగా ఆదర్శంగా నిలిచారో వివరించారు. అలాగే చంద్రబాబు నాయుడు నడకను, నడతను దగ్గర నుంచి చూసిన పెద్దలు, ఆయనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు.  ఎక్కడా రాజకీయ ప్రసంగాలు లేకుండానే ఐటీ ఉద్యోగులు చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేయడం ఎంత దుర్మార్గమో చాటారు. జగన్ అరాచకత్వంపై, అడ్డగోలు విధానాలపై జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుని బయటకు రావడానికి కారణమయ్యారు. ఆ గ్రాటిట్యూడ్ సభతో జగన్ పతనానికి బీజం పడిందని చెప్పవచ్చు. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.