తరచు ఎన్నిక‌లతో ప్రజా ధ‌నం వృధా : డిప్యూటీ సీఎం పవన్

Publish Date:May 26, 2025

Advertisement

 

దేశం ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  చెన్నైలో జరుగుతున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ సెమినార్‌లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు జమిలీ ఎన్నికలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. తరచూ ఎన్నికలతో కేంద్రంపై భారం పడుతుందని ఆయన తెలిపారు.భారత్‌కు ఉన్న సామర్ధ్యం రీత్యా ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యమే అని తెలిపారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ప్రధాని మోదీనే అని పవన్ పేర్కొన్నారు.

త్వరల్లో తమిళనాడులో ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు ఖాయమని అన్నారు. అవసరం అయితే ఇక్కడ ప్రచారం చేసేందుకు తాను వస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ క్రమంలో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని అన్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై వైసీపీకీ ఓ విధానం లేదని అన్నారు. 2019లో వైసీపీ గెలిచింది కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారనే అని ఆయన తెలిపారు. పవన్‌సై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై ప్రశంసలు కురిపించారు. పవన్ ఏపీ నుంచి ఓ శక్తిలా ఇక్కడికి వచ్చారని ఆయను సుస్వాగతం మీరు రావడం నాకే కాదు మొత్తం తమిళనాడుకే చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

By
en-us Political News

  
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.