Publish Date:May 19, 2023
రాజులు పోయారు. రాచరికాలు పోయాయి. రాజప్రసాదాలు మాత్రం వారి చిహ్నాలుగా నిలిచిపోతున్నాయి. వేల సంవత్సరాల నుంచి పాలకులు తమ మార్కును ప్రదర్శించాలనుకుంటున్నారు. ప్రస్తుతమున్న రాజప్రసాదాలు అలనాడు కట్టిన అపురూప సౌందర్య సౌధలు. ప్రస్తుతమున్న పార్లమెంటు భవనం కూడా ఆ కోవలోకే వస్తుంది. ప్రధాని మోడీ ఈ నెల 28న వీరసావర్కర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిజాం నాటి కట్టడాన్నికూల్చేసి కొత్తగా సచివాలయం కట్టడానికి పెద్ద లాజిక్ లేదు. తమ పాలనలో నిర్మితమైన తీపి గుర్తులు ప్రజల మదిలో తర తరాలుగా నిలిచిపోవడానికి ఇలా కట్టడాలు నిర్మిస్తారని చెప్పడానికి ఇతరత్రా కారణం లేదు. పాలకులు తమకు గుర్తింపు చిహ్నాలు నిర్మించాలన్న ఆకాంక్షతో యాదగిరి గుట్ట దేవాలయం, తెలంగాణ సచివాలయ పునర్ నిర్మాణం అని వేరే చెప్పనవసరం లేదు. నిజాం కాలం నాటి కట్టడాన్ని స్వాతంత్ర్యం అనంతరం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సచివాలయం పాత సెక్రెటేరియట్ భవనం. ఇతరత్రా అవసరాలకోసం ఆ భవనాన్ని వినియోగించుకోవచ్చు. కానీ ఆఘమేఘాల మీద ఆ భవనాన్ని కూల్చేసి కొత్త సచివాలయాన్ని పెర్సియన్ శైలిలో కట్టారు.
ప్రస్తుతం కట్టిన పార్లమెంటు భవనం గూర్చి పరిశీలిస్తే ఆసక్తికర కథనాలు అనేకం ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
న్యూఢిల్లీలోని సంసద్ మార్గ్ లో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అక్షరాల రూ 862 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది.
సెంట్రల్ విస్తా రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు చేపట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టను మరింత ఇనుమడింప జేసే విధంగా దీన్ని నిర్మించారు. ఇండియా గేట్ రాష్ట్రపతి భవన్ మధ్య ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ కట్టడాన్ని నిర్మించే బాధ్యత టాటాప్రాజెక్ట్స్ లిమిటెడ్(టిపిఎల్) కు దక్కింది. 2020 అక్టోబర్ 20వ తేదీన ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ కొత్త పార్లమెంట్ భవనం ఈ సవత్సరం ఆగస్టులో ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ కంటే నెల రోజుల ముందే ఈ భవనాన్ని వీరసావర్కర్ జన్మ దినోత్సవాన్నిపురస్కరించుకుని ప్రారంభించనున్నారు. 1927సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం నిర్మించిన కట్టడంలోనే ఇప్పటి వరకు పార్లమెంటు భవనం కొనసాగింది. ఆ భవనం స్థానే దీన్ని నిర్మించారు.
65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం నాలుగు అంత స్థుల్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ నూతన భవనానికి 6.5 మీటర్ల ఎత్తులో ఉన్న జాతీయ పతాక చిహ్నం, ఆసియాటిక్ నాలుగు సింహాలు హైలైట్ అని చెప్పొచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-more-monument-parliament-new-building--25-155604.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.