ఒక భేటీ రెండు ప్రయోజనాలు: కేసీఆర్ తాజా వ్యూహం

Publish Date:Apr 18, 2022

Advertisement

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీకి ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిరాడంబరంగా జరుపుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ ఏడు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించి అందుకు భారీ ఏర్పట్లనూ మొదలెట్టేసింది తెరాస పార్టీ. 

పనిలో పనిగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానే...జాతీయ స్థాయి నేతగా బీజేపీయేతర పార్టీలను కలుపుకుని పోయేందుకు, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ నేతగా ఆ ప్రయత్నాలను తాను ముమ్మరంగా చేస్తున్నట్లూ కేడర్ కు చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆవిర్భావ దినోత్సవానికి ఒకటి రెండు రోజుల ముందు  వివిధ రాష్ట్రాల నుంచి పలువురు నేతలను ప్రగతి భవన్ కు ఆహ్వానించి వారితో బీజేపీ యేతర కూటమిపై చర్చించేందుకు సిద్ధమౌతున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు డీఎంకే నుంచి కణిమెళి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన నుంచి ఒక అగ్రనేతనూ ఆహ్వానించినట్లు చెబుతున్నారు.  అయితే వీరిలో ఎవరెవరు వస్తారు, ఎవరు రారు  విషయంలో మాత్రం స్పష్టత లేదు.  
ఈ నెల 27న తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుక జరగనుండగా  సరిగ్గా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఒకటి రెండు రోజుల ముందే ఈ భేటీ ఏర్పాటు చేయడం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉంది. కేంద్రంలో మోడీని ఢీ కొనగలిగే బలమైన నేతగా తనను తాను పార్టీ కేడర్ ముందు ఫోకస్ చేసుకోవడం, అదే సమయంలో జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు తనకు ఉందని విపక్షాలకు తెలియజేయడం ద్వారా రాష్ట్రంలో వాటి దూకుడుకు కళ్లెం వేయడం. ఇలా ఒక్క భేటీతో రెండు ప్రయోజనాలనూ ఏకకాలంలో నెరవేరే విధంగా కేసీఆర్ ప్రగతి భవన్ భేటీకి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు.

అయితే శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ముంబై వేదికగా త్వరలో 13 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరుగనుందనీ, ఈ భేటీలో రానున్న ఎన్నికలలో ఐక్యంగా ముందుకు సాగడం, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, శ్రీరామనవమి, హనుమజ్జయంతి సందర్భంగా  శోభాయాత్రలపై జరిగిన దాడులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పటికే బీజేపీ యేతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారనీ వెల్లడించారు.

త్వరలో ముంబై వేదికగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుండగా  వేరుగా ఆ సదస్సుకు హాజరయ్యే పార్టీల నుంచి నేతలను కేసీఆర్ ఆహ్వానించడంలోని ఆంతర్యమేమిటన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు బీజేపీయేతర కూటమికి తానే ఛాంపియన్ అని చాటుకోవడమే కారణమని విశ్లేషిస్తున్నారు. ముంబై భేటీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేలే షో స్టీల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భేటీకి ఆహ్వానిస్తే మమతా బెనర్జీ లేఖలు రాస్తే...ఈ భేటీకి వేదికగా ముంబై ఎంపికైంది. దీంతో ఆ ఇరువురి ఆధ్వర్యంలోనే భేటీ జరిగిందనే అందరూ భావిస్తారు. దీంతో బేజీపీ యేతర ఫ్రంట్ ను లీడ్ చేసే నేతగా కేసీఆర్ కు గుర్తింపు లభించే అవకాశం ఉండదు. అందుకే ఆ సదస్సుతో సంబంధం లేకుండా బీజేపీ యేతర పార్టీల సీనియర్ నేతలతో కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీ ఏర్పాటు చేశారంటున్నారు. ఇంతకీ ముంబై భేటీకి కేసీఆర్ కు ఆహ్వానం ఉందా...ఒక వేళ ఉంటే వెళతారా అన్న విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా లేదు.
 

By
en-us Political News

  
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.