వయసు 90 పైనే...కలయితో 16 అయింది!

Publish Date:Oct 25, 2022

Advertisement

స్నేహం మీద అనేకానేక కథలు, సినిమాలు వచ్చేశాయి. హీరో విలన్ కలిసిపోవడం, ఒక పెద్దాయన కష్టాల్లో ఉన్నాడని తెలిసి మరో వ్యక్తి సహాయానికి వెళితే అతను తన బాల్యమిత్రుడని గుర్తించి ఆనందంగా సాయంచేయడం.. స్నేహ మేరా జీవితం.. అంటూ గట్టిగా కావలించేసుకుని పాడేసుకోవడం.. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ పెద్ద రోడ్డుకి అవతల నుంచి స్నేహితుడి కోసం పరుగులు తీసి ఇవతలున్న స్నేహితుడిని కలవడం.. మామూలే. చిత్రమేమంటే ఇద్దరు పెద్దవాళ్లు ఏకంగా 75 ఏళ్ల తర్వాత కలిశారు. వారి ఉద్వేగానికి అంతే లేదు.

బాల్యంలో కలిసినవారు అనేకానేక కారణాల వల్ల విడిపోయి చాలాకాలం తర్వాత కలవడం వింటూనే ఉంటాం. అయితే మరీ ముదిమి వయసులో కలవడమే ఈ యిద్దరి ప్రత్యేకత. అవును ఎప్పుడు రెండో ప్రపంచయుద్ధంలో కలిసి పనిచేసిన కుర్రాళ్లు పండు ముసలి వయసులో హఠాత్తుగా ఎదురయ్యారు. తప్పకుండా ఇది తెలుగు సీనిమా సీన్ అయితే కాదు.  

ఒక షాపింగ్ మాల్ కి 95 ఏళ్ల పెద్దాయన మనవరాలితో వెళ్లాడు. అక్కడ కొంతసేపు కాలక్షేపం చేసి బయటికి వస్తున్నాడు. అప్పుడే దాదాపు అంతే వయసున్న మరో పెద్దాయన మనవడి సాయంతో లోపలికి వచ్చాడు. లోపలికి వస్తూనే అవతలి ముసలాయన్ని గుర్తించాడు. వీడు నా ఫ్రెండ్ అని గుర్తించాడు. అంతే పరుగులాంటి నడకతో వెళ్లి  ఆ ముసలాయన్ని కౌగిలించుకున్నాడు. నేన్రా.. నేను.. అంటూ రెండో ప్రపంచయుద్ధసమయంలో నేవీలో పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేశాడు. అవును నిజమే.. అనుకుని పేలవంగా నవ్వలేదు.. అమాంతం హత్తుకున్నాడు.. ఆ ముసలాయన కూడా. 

పెద్దాయన వాళ్లింటికి తీసికెళ్లాడు...75 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితుడితో 90 సంవత్సరాల సంభాషణ చేశాడు. యుద్ధానికి వెళ్లడం, అంతకుముందు కలిసిన రోజు, కలిసి నేవీలో పనిచేయడం, అంతా.. కానీ ఆ తర్వాత ఎంతో వెతికానని ఎవరూ తన గురించి చెప్పలేకపోయారని చెప్పుకున్నారు.. వారికి కనీసం మూడు గంటలపాటు ఆకలి అనిపించలేదు, డ్రింక్స్ అలానే ఉండిపోయాయి, అంతా మాటలు, కబుర్ల ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎన్నో కథలు, ఎన్నో సరదాలు, సీరియస్ అంశాలు, పిల్లలు, మనవలు, మనవరాలు, ఆనందం, దుఖం, నవ్వులు, కాసిని ఏడుపులు... సర్వం వారిద్దరి మధ్యా అలా ప్రవాహ మయ్యాయి. 

స్నేహబలం అంతే. ఎన్నాళ్లుపోయినా యంగ్ అండ్ ఎనర్జటిక్. అవును వాళ్లిద్దరూ పదహారేళ్లవారే. వాళ్లే కాదు అలా కలిసినవారంతా పరమ కుర్రాళ్లే. మీరయినా అంతే. పాత బాగా పాత... కనీసం ముప్పయ్యే ళ్లయినా కలవని స్నేహితులను కలవడానికి ప్రయత్నించండి.. వయసు, వ్యధలు, మౌనం.. అన్నీ వీడిపోతాయి. 

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.