రాజధాని నిర్మాణానికి రూ. 2లక్షల 116లు విరాళం
Publish Date:Aug 11, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ వృద్దురాలు తన వంతుగా విరాళం అందజేశారు. నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ రెండు లక్షల నూట పదహారు రాపాయల విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో సోమవారం (ఆగస్టు 11)న స్వయంగా కలిసి ఈ విరాళం చెక్కును అందించారు. రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ఆమెను అభినందించారు. రాష్ట్ర రాజధాని అత్యంత గొప్పగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో ఆబాట గోపాలం రాజధాని నిర్మాణం పట్ల ఎంతో ఉత్సాహంతో ఉన్నారనడానికి కాసా నాగేంధ్రమ్మ తన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా సచివాలయం వరకూ వచ్చి విరాళం అందించడమే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/old-women-donation-to-rajadhani-25-204015.html





