క్షమించు దీదీ.. మమతా  బెనర్జీకి మాజీల వినతి

Publish Date:May 24, 2021

Advertisement

పశ్చిమ్ బెంగాల్లో సీన్ రివర్స్ అవుతోందా? అసెంబ్లీ ఎన్నికలకు  ముందు క్యూకట్టి కమలదళంలో చేరిన తృణమూల్ నాయకులు, ఎమ్మెల్ల్యేలు మళ్ళీ మాతృ సంస్థ పంచన చేరేందుకు సిద్డంవుతున్నారా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అందరూ కాకపోయినా, కొందరు, ముఖ్యంగా ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ఎమ్మెల్ల్యేలు, అలాగే,  ద్వితీయ శ్రేణి నాయకులు తొందరపడితప్పు చేశామనే ఆలోచనకు చేరుకుంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తప్పు ఒప్పుకుని దీదీకి దాసోహం అనేందుకు సైతం సిద్డమవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీకి లేఖ రూపంలో అభ్యర్ధన పంపారు. తప్పు చేశానని తొందర పడ్డానని ఒప్పుకుంటూ, ప్లీజ్, దయచేసి నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకోండి, మీకు, పార్టీకి విధేయంగా ఉంటాను, పార్టీ అభివృధికి కృషి చేస్తాను, అంటూ ఆమె ప్రాదేహపూర్వకంగా అభ్యర్దించారు. 

సోనాలీ గుహ బాటలో ఇప్పుడు, మరో నాయకురాలు సరళా ముర్ముకూడా తనను కూడా తిరిగి పార్టీలోకి తీసుకోవాలని  ప్రాధేయ పూర్వకంగా కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు టికెట్ ఇచ్చిన హబీబ్పుర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక ఆమె, ఆఖరి నిముషంలో బీజేపీలో చేరారు.  సొంత నియోజక వర్గం మాల్దా నుంచి పోటీ చేశారు. అయినా ఓడి పోయారు. దీంతో ఆమెకు జ్ఞానోదయం అయిందో ఏమో,తనను క్షమించాలని దీదీని కోరారు. బీజేపీలో చేరి తప్పు చేశానని, మళ్లీ ఇప్పుడు టీఎంసీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశమివ్వాలని అభ్యర్థించారు.అంతే కాదు, మమతా దీదీ దయతో తనను తిరిగి పార్టీలో చేర్చుకుంటే, చేసిన తప్పు దిద్దుకుని దీదీతో కలిసి పనిచేస్తాననిం ముర్ము స్పష్టం చేశారు. 

ఈ రివర్స్ వరద ఎంతవరకు వెళుతుందనే   విషయంలో, ఎవరి అంచనాలు వారికున్నాయి. నిజానికి బీజేపీ ఈ పరిణామాన్ని ముందుగానే గమనించింది. అందుకే, నారద కుంభకోణం కేసును తెరమీదకు తెచ్చింది. సెలెక్టివ్’గా తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి సహా, ఇతర నేతలను వదిలేసి, ఇద్దరు తృణమూల్ మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, తృణమూల్‌ మాజీ నాయకుడు సోవన్‌ ఛటర్జీలను సీబీఐ అరెస్ట్ చేసింది.అంటే, బీజేపీలో చేరి మళ్ళీ మమత వైపు వెళ్ళే ఆలోచన చేస్తే,కేసులు, వేధింపులు, అరెస్టులు తప్పవని హెచ్చరిక చేసింది. ఆ విధంగా,  రివర్స్ ఫిరాయింపులకు కొంత వరకు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తోంది. మరో వంక, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన   తృణమూల్ కాంగ్రెస్’కు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించవలసిన అవసరం లేదు. కాబట్టి, ఇప్పటికిప్పుడు ఫిరాయింపుల జోరు ఉండక పోవచ్చును అని పరిశీలకులు భావిస్తున్నారు. 

సోమవారం నారద కుంభకోణం కేసు సుప్రీం కోర్టుకు చేరింది.. ఈ కేసులో అరెస్టయిన టీఎంసీ మంత్రులు, మరో ఇద్దరు నేతలను గృహనిర్బంధంలో ఉంచాలన్న కోల్‌కతా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మరో మరో వంక సోమవారమే ఈ నలుగురు నేతల బెయిల్‌ పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుంది.. ఇటు సుప్రీం కోర్టు అటు రాష్ట్ర హై కోర్టువిచారణలో ఉన్న ఈ కేసు ఇంకెన్ని మలుపులు  తీసుకుంటుందో చూడవలసి వుంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.