మద్యం షాపుల్లో ఇక డిజిటల్ చెల్లింపులకూ ఓకే.. మర్మమేమి తిరుమలేశా?!

Publish Date:Nov 19, 2022

Advertisement

 ఇంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోని వైసీపీ సర్కార్ ఎట్టకేలకు మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు ఓకే చెప్పింది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాకా.. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ వ్యాపారంగా మార్చేశారు. ప్రజలలో మద్యం అలవాటు మాన్నించడానికే అంటూ మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్యను కూడా క్రమంగా తగ్గించుకుంటూ వస్తానంటూ కొత్త విధానాన్ని ప్రకటించారు.

కొత్త కొత్త బ్రాండ్లను తీసుకువచ్చారు. దీంతో ధర ఎక్కువ, నాణ్యత తక్కువ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ధరలు పెంచేశారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి అన్ని చోట్ల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరగడానికి లేని అభ్యంతరం ఒక్క మద్యం దుకాణాల్లోనే ఎందుకన్న ప్రశ్నలూ తలెత్తాయి. మద్యం దుకాణాల్లో డిజిటల్, ఆన్ లైన్ పేమెంట్లకు వీల్లేదన్న ఆంక్షలపై విమర్శలే కాదు అనుమానాలూ వ్యక్తమయ్యాయి.  నిత్యం కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగే మద్యం వ్యాపారంలో డిజిటల్ చెల్లింపుకు ఎందుకు అనుమతించడం లేదన్న ప్రశ్నలూ వెల్లువెత్తాయి. ఎందుకంటే    మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వానివే అయినా..సరఫరా.. తయారీ..   మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లో ఉంది.

దీంతో మద్యం దుకాణాల్లో నగదు లావాదేవాలకు మాత్రమే అనుమతి అంటూ ప్రభుత్వం చెబుతుండటంతో.. ఆ సొమ్మంతా ఎక్కడకు పోతోందన్న అనుమానాలు పొడసూపాయి. ఈ సొమ్మ బ్లాక్ మనీగా  తరలిపోతోందని విమర్శలూ ఉన్నాయి. ఇక బేగం పేట విమానాశ్రయం నుంచి  ప్రైవేట్ చార్టర్డ్ విమానాల్లో పెద్ద మొత్తంలో సొమ్ము తరలించారని ఢిల్లీ మద్యం స్కాం దర్యాప్తు చేస్తున్న ఈడీ దర్యాప్తులో తేలడంతో ఏపీలో మద్యం సొమ్మును కూడా అలాగే తరలిస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్, విశాఖ పాత విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించిన చార్టర్ట్ ఫ్లైట్ల గుట్టు కూడా బయట పెట్టాలంటూ తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి సొమ్ము తరలింపునకు ఉపయోగించిన చార్టర్డ్ విమానాలు ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య అనికా టేక్రీవాల్ రెడ్డికి చెందిన జెట్ సెట్ గో సంస్థకు చెందినవని ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పై విమర్శల దాడి జరిగింది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు.. వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి అల్లుడి అన్న కావడం.. అంతకంటే ముందే.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు కావడంతో జగన్ సర్కార్ డిఫెన్స్ లో పడింది. దీంతో గత్యంతరం లేకనే మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ కు కూడా అనుమతి ఇస్తామని ప్రకటించింది. సోమవారం (నవంబర్ 21) నుంచే ఏపీలోని మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను అనుమతిస్తామని ప్రకటించింది. ఇప్పటి దాకా అనుమతించని డిజిటల్ పేమెంట్లకు ఇప్పుడెందుకు అనుమతిస్తున్నారన్న ప్రశ్నకు షాపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తేలిందనీ, దానిని అరికట్టేందుకేననీ బదులిస్తోంది.

ఇంత కాలం ఆ విషయాన్ని గుర్తించలేదా అన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. పోనీ సిబ్బంది చేతివాటానికి అవకాశం లేకుండా మద్యం దుకాణాల్లో పూర్తిగా డిజిటల్ పేమెంట్పే అంటున్నారా అంటే అదీ లేదు. నగదు చెల్లింపులకూ చాన్స్ ఉంటుందంటున్నారు. అంటే సిబ్బంది చేతి వాటానికి భయపడే డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి ఇస్తున్నామన్న మాట పూర్తిగా వాస్తవం కాదన్న మాట. విమర్శలకు తలొగ్గే ఆ నిర్ణయం తీసుకున్నారని అర్ధమౌతోంది. కానీ డిజిటల్ పేమెంట్స్ అని బయటకు చెప్పినా అది నామ్ కే వాస్తే అమలు చేస్తారనీ, సాంకేతిక సమస్య సహా పలు రకాల సాకులతో మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులకే పట్టుబట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.