Publish Date:Jul 27, 2022
జగన్ పాలన అధికారులను బోనులో నిలబెట్టే దిశగా సాగుతోంది. కోర్టు ఆదేశాల ఉల్లంఘన, నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుండటంతో రేపేదైనా తేడా వస్తే అధికారులే ముద్దాయిలుగా బోనులో నిలబడక తప్పని పరిస్థితి ఎదురౌతుంది.
అయినా కూడా వారేం చేయలేక ఏలిన వారి ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి. తాజాగా విశాఖ రుషి కొండ తవ్వకాలు, నిర్మాణాల విషయంలో సుప్రీం ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా అక్కడ జరుగుతున్న పనులను గమనిస్తే ఆధికారులను బలిపశువులను చేసే దిశగా జగన్ వారి చేత నిబంధనలు ఉల్లంఘించైనా సరే పనులు చేయాలని ఆదేశాలు ఇచ్చారని అనిపించక మానదు. రిషికొండ నిర్మాణాలపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది.
రిషికొండ తవ్వకాలపై ఇప్పిటికే సుప్రీం కోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. కొండ కొత్తగా ఎటువంటి తవ్వకాలూ చేపట్ట వద్దనీ, నిర్మాణాలు కూడా గతంలో నిర్మాణాలు ఉన్న చోటనే చేపట్టాలని విస్పష్ట రూలింగ్ ఇచ్చింది. అయితే సుప్రీం తీర్పును యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రిషి కొండలో తవ్వకాలూ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త ప్రాంతాలలో నిర్మాణాలూ ఆఘమేఘాల మీద కొనసాగుతున్నాయి. సుప్రీం ఆదేశాలలో ఏక్కడో అక్కడ నిర్మాణాలు చేపట్టవచ్చని ఉంది కనుక మనం ఎక్కడ అనుకుంటే అక్కడే నిర్మాణాలు చేసేద్దామన్న రీతిలో ఇష్టారీతిన నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది.
అది కూడా వందల మంది కార్మికులను నియమించి వాయు వేగంతో నిర్మాణాలుపూర్తి చేస్తున్నది. భవిష్యత్ లో సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే.. కోర్టును తపపుదోవ పట్టించినందుకు, ఆదేశాలను ఉల్లంఘించినందుకు బోనెక్కాల్సింది ముఖ్యమంత్రి కాదు. దగ్గరుండి పనులు చేయించిన మంత్రులూ కాదు. అధికారులే. అందుకే జగన్ పాలనలో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కగా మారింది. నిబంధనల మేరకే పని చేస్తామంటూ సీఎం ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది.
కాదంటే కోర్టు బోనెక్కి తప్పు నిబంధనల ఉల్లంఘన నిరూపితమైతే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. తృటిలో శిక్షను తప్పించుకుని సామాజిక సేవ చేయడానికి అంగీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పలువురు అధికారులు కేసుల్లో ఇరుక్కుని జైలు జవితం అనుభవించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ హయాంలో కూడా అదే విధంగా అధికారులు దోషులుగా నిలబెట్టైనా సరే పబ్బం గడుపుకుందామన్న రీతిలో జగన్ తీరు ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/officers-at-risk-in-jagan-rule-25-140636.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.