Publish Date:May 18, 2023
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ చాణక్యుడు అన్న పదానికి సరిగ్గా అతికినట్లు సరిపోతారు.
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! అన్నట్లు.. వివాదాలకు దూరంగా ఉంటారు. రాష్ట్రంలో అత్యధిక కాగం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన విజయ రహస్యం ఆయన వ్యవహార శైలే. రాష్ట్రంలో బీజేపీతో కయ్యం, జాతీయ స్థాయిలో నెయ్యం ఆయన తీరు. అదే ఆయనను ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులలా కేంద్రం నుంచి చిక్కులు ఎదుర్కొనే అవకాశం లేకుండా తప్పిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ. తన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలతో ఏ మాత్రం రాజీపడకుండా ఆయన నెరపే రాజకీయ సంబంధాలు పరిశీలకులను సైతం అచ్చెరువునకు గురి చేస్తాయనడం అతిశయోక్తి కాదు.
ఒడిశా జర్సుగూడ ఉప ఎన్నికల్లో బీజేపీపై తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన గంటల వ్యవధిలో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. కమలం పార్టీ డబుల్ ఇంజన్ తో ప్రజలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రజారంజక పాలనే అన్నిటికంటే ముఖ్యమన్నారు. ఈ మాటలు మాట్లాడడానికి కొద్ది రోజుల ముందే ఆయన హస్తినలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అక్కడ ఆయన బీజేపీ వ్యతిరేక కూటమిలో తాను భాగస్వామిని అయ్యే ప్రశక్తే లేదన్న విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో ఆయన బీజేపీకి సన్నిహితం అవుతున్నారన్న ఊహాగానాలు కూడా చెలరేగాయి. అంత కంటే ముందు నవీన్ పట్నాయక్ తో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేర్వేరుగా కలిశారు ఈ రెండు సందర్భాలలోనూ ఆయన తమ భేటీకీ రాజకీయాలకూ సంబంధం లేదనే అన్నారు. వాస్తవానికి నితీష్, మమత ఇరువురూ కూడా 2024 ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడి పోరాటానికి నవీన్‌ను ఆహ్వానించడానికే వచ్చారు. అది బహిరంగ రహస్యం.
అయినా వారితో తన భేటీలలో రాజకీయాలు లేవని నవీన్ ప్రకటించేశారు. ఇలా ప్రతి సందర్భంలోనూ తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించే నవీన్ పట్నాయక్ స్వరాష్ట్రమైన ఒడిశా ప్రయోజనాలు, ప్రగతి విషయంలో మాత్రం రాజీపడరు. అందుకే దేశంలో సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన ముఖ్యమంత్రులలో ముందు వరుసలో నిలిచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/odisha-cm-neo-politics-39-155530.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!