16/8 డైట్‌ అంటే ఏంటి?

Publish Date:Oct 30, 2020

Advertisement

 

ఇప్పుడు ఎవర్ని చూసినా ఒబెసిటీతోనే బాధపడుతున్నారు. దాంతో పాటే వచ్చే డయాబెటిస్‌, గుండెపోటులాంటి సమస్యలూ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. శరీర శ్రమ లేని లైఫ్‌ స్టైల్‌, ఏదిపడితే అది ఎడాపెడా తినేయడం మన ఒబెసిటీకి కారణం అని చిన్నిపిల్లాడికి కూడా తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. అందుకే దీన్ని నివారించడానికి అప్పుడప్పుడూ రకరకాల చిట్కాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటైన 16/8 డైట్‌ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. ఆ 16/8 డైట్‌ కథ ఏంటో మీరే చూడండి...

 

ఒకప్పుడు తిండి తినడానికి కూడా సమయం ఉండేది. రాత్రి చీకటిపడేలోగా తినేసి పక్కల మీదకి చేరేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు! పొద్దన్న ఆరింటికి మొదలుపెడితే రాత్రి పదకొండు గంటల వరకూ పొట్టలో ఏదో ఒకటి పడుతూ ఉండాల్సిందే! దీనికి విరుగుడుగానే 16/8 డైట్‌ని కనిపెట్టారు. ఇది పాటించేవాళ్లు రోజులో 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. మిగతా 16 గంటలూ కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు మన తిండి అంతా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల లోపే ముగించేయాలి. మర్నాడు ఉదయం పదిగంటల వరకూ ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. మిగతా సమయంలో శరీరం నీరసించిపోకుండా ఉండేందుకు షుగర్‌ ఉండని లిక్విడ్స్ (నీళ్లు, బ్లాక్‌ టీ, నిమ్మరసం...) తీసుకోవచ్చు.

 

ఈ 16/8 డైట్‌లో మిగతా 16 గంటలూ ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల, శరీరం ఒంట్లో పేరుకున్న కొవ్వుని కరిగించడం మొదలుపెడుతుంది. ఓ మూడు నెలల పాటు ఈ పద్ధతిని పాటించినవాళ్లలో ఒబెసిటీ తగ్గినట్లు, బీపీ కూడా అదుపులో ఉన్నట్లు తేలింది.

 

వినడానికి ఈ పద్ధతి బాగానే ఉంది. పాటించడానికి తేలికగా కూడా ఉంది. కానీ ఎవరు పడితే వాళ్లు ఈ డైట్‌ ఫాలో అయ్యేందుకు సిద్ధపడితే మాత్రం ప్రమాదం తప్పదు. షుగర్‌, గ్యాస్ట్రిక్‌ లాంటి సమస్యలు ఉన్నవారు దీని జోలికి పోకపోవడమే బెటర్‌. ఏదన్నా తిని మందులు వేసుకోవాల్సినవాళ్లు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకి కూడా ఈ పద్ధతి సరిపడదని చెబుతున్నారు. మిగతావాళ్లు మాత్రం అలా ఓసారి ఈ పద్ధతిని పాటించి చూడవచ్చునట. మరెందుకాలస్యం... ఓ రాయి వేయండి. ఏమో ఎవరికి తెలుసు- ఏ పుట్టలో ఏ రాయి ఉందో!  https://www.youtube.com/watch?v=UFOfu35n7l8

- నిర్జర.

 

By
en-us Political News

  
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.